Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్ చేశారు. తాను నోరు గనుక విప్పితే నువ్వు తట్టుకోలేవవంటూ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఎవరి బతుకు ఏమిటో అందరికీ తెలుసన్నారు.
Vijay Sai Reddy Slams Purandeswari
విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy) మీడియాతో మాట్లాడారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని తప్పు పట్టారు. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు. పురందేశ్వరి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేయడం లేదని , కేవలం తన బావ చంద్రబాబు నాయుడును రక్షించేందుకు మాత్రమే పని చేస్తోందంటూ మండిపడ్డారు.
ఎవరు ఎవరి అజెండాను అమలు చేస్తున్నారో రాష్ట్రానికి తెలుసన్నారు. గతంలో పార్టీని మారిన వాళ్లకు తమను అనే హక్కు, అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ తన కుటుంబం, తన సామాజిక వర్గం గురించి తప్ప రాష్ట్రం గురించి కానీ, ప్రజల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఎద్దేవా చేశారు.
మద్యం డిస్టలరీలపై పురందేశ్వరికి ఏమైనా అనుమానాలు ఉంటే వెరీఫై చేసుకోవాలని సూచించారు. తన తనయులు చెప్పిన మాటలు విని తనను టార్గెట్ చేయాలని చూస్తే నీ గురించి అసలు విషయాలు బయటకు చెప్పాల్సి వస్తుందని, తాను నోరు విప్పితే తట్టుకోవడం కష్టమన్నారు.
Also Read : Babu Mohan : బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్