Vijay Sethupathi : స్టార్ ను కాను సామాన్యుడిని – సేతుపతి
తమిళ నటుడుసంచలన కామెంట్స్
Vijay Sethupathi : తమిళంలో స్వల్ప కాలంలోనే మోస్ట్ పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఆయన నటించిన సినిమాలకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ తరుణంలో తనను పాన్ ఇండియా స్టార్ అంటూ కొందరు పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తనకు ఓ లేబుల్ ఇవ్వడాన్ని లేదా ఆపాదించడాన్ని ఇష్టపడనని స్పష్టం చేశారు.
తాను సామాన్యుడినని, అలా ఉండేందుకు, పిలిపించు కునేందుకు ఇష్ట పడతానని చెప్పారు విజయ్ సేతుపతి(Vijay Sethupathi). సినిమా రంగంలో ఉన్నంత మాత్రాన స్టార్లు అని పిలవాల్సిన అవసరం లేదన్నారు. ఇది కూడా అన్ని రంగాల లాగా ఒక రంగమేనని దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు నటుడు . పాన్ ఇండియా స్టార్ అని పిలవడంతో తాను సుఖంగా లేనని స్పష్టం చేశారు విజయ్ సేతుపతి.
తాను అత్యంత సాధారణంగా , సామాన్యమైన లైఫ్ ను ఇష్ట పడతానని ఏదీ తనకు ఆనందాన్ని ఇవ్వదని కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ సినీ రంగంలో కలకలం రేపుతున్నాయి. ప్రతి ఒక్కరు ఒక్క సినిమాకే స్టార్ డమ్ కోరుకుంటారని కానీ సేతుపతి ఇలా స్పందించడాన్ని ప్రశంసిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.
ఏది ఏమైనా ప్రతిభ అన్నది నటుడిలో ఉన్నా దానిని వెలికి తీసే బాధ్యత డైరెక్టర్ కు ఉంటుందని దానిని తాను గుర్తిస్తానని చెప్పాడు సేతుపతి. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్లు మాట్లాడంలో మనోడు గట్టోడు.
Also Read : పఠాన్ విజయం కలెక్షన్ల వర్షం