Vijay Shankar : విజ‌య్ శంక‌ర్ షాన్ దార్ ఇన్నింగ్స్

24 బంతుల్లో 51 ర‌న్స్ తో కీల‌కం

Vijay Shankar : కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పై డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ లో ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్ దంచి కొట్టాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 39 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఆండ్రీ ర‌స్సెల్ 2 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 34 ర‌న్స్ తో దుమ్ము రేపాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ లో విజ‌య్ శంక‌ర్ స‌త్తా చాటాడు. కేవ‌లం 24 బంతులు ఎదుర్కొని 51 ప‌రుగుల‌తో స‌త్తా చాటాడు. ఇందులో 2 ఫోర్లు 5 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. చివ‌రి దాకా ఉన్నాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కిల్ల‌ర్ మిల్ల‌ర్ తో క‌లిసి విజ‌య శంక‌ర్ 87 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. శుభ్ మ‌న్ గిల్ కేవ‌లం ఒక్క ప‌రుగు తేడాతో హాఫ్ సెంచ‌రీ మిస్ అయ్యాడు. 49 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి.

ఇక గుజ‌రాత్ ప‌రంగా చూస్తే బౌల‌ర్లు ష‌మీ 33 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే జోష్ లిటిల్ 25 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు పడ‌గొట్టాడు. ఎడ‌మ చేతి ఆఫ్గ‌నిస్తాన్ బౌల‌ర్ నూర్ అహ్మ‌ద్ 21 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

Also Read : గుజ‌రాత్ టైటాన్స్ జైత్ర‌యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!