Thalapathy Vijay Divorced : విజయ్ సంగీత దూరం నిజమేనా
విడాకులు ఇస్తున్నాడంటూ టాక్
Thalapathy Vijay Divorced : సినీ రంగంలో బంధాలు విచిత్రంగా ఉంటాయి. కానీ పెళ్లిళ్లు చేసుకున్న నటీ నటులు చాలా కాలం పాటు కలిసి ఉన్నది తక్కువ. కొందరు మాత్రామే చివరి దాకా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.
తాజాగా తమిళనాడులో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్న తళపతి విజయ్ గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనను ఏరికోరి పెళ్లి చేసుకున్న సంగీత కు దూరంగా ఉంటున్నాడని, డైవోర్స్(Thalapathy Vijay Divorced) కూడా ఇవ్వనున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది కోలీవుడ్ లో.
డైనమిక్ డైరెక్టర్ అట్లీ భార్య సీమంతం వేడుకకు తళపతి విజయ్ ఒక్కడే హాజరయ్యాడు. భార్య సంగీత పక్కన లేదు. మరో వైపు పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తీసిన వారసుడు మూవీ ప్రీ ఈవెంట్ ఫంక్షన్ కు హాజరు కాలేదు. దీంతో వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
తళపతి విజయ్ ది భిన్నమైన మనస్తత్వం. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ ఎత్తున ఉంది. పార్టీకి సంబంధించిన విషయంలో తన తండ్రితో కొంచెం దూరంగా ఉండడం కూడా అప్పట్లో సంచలనం కలిగించింది. తాను పార్టీ పెట్టడం లేదంటూ ప్రకటించాడు. తన తండ్రి చంద్రశేఖరన్ కు సంబంధం లేదంటూ వెల్లడించాడు.
అయితే తళపతి విజయ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో అలాంటి వాడు కాదంటున్నారు. సంగీత పిల్లలతో కలిసి అమెరికా వెళ్లిందని, త్వరలోనే హీరో వెళతాడని ఇదంతా కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు నెట్టింట్లో విజయ్, సంగీత వైరల్ గా మారారు.
Also Read : విజయ్ మేనియా వరిసు వారెవా