Vijay -TVK Party : హీరో విజయ్ టీవీకే పార్టీలో మాజీ ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రాజ్
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అరుణ్ దేనని ఆయన తెలిపారు...
TVK Party : మాజీ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)లో చేరారు. వెంటనే ఆయన్ని పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార కార్యదర్శిగా నియమించారు. బిహార్‌లో ఐటీ అదనపు కమిషనర్‌గా పనిచేసిన అరుణ్‌రాజ్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సోమవారం పనయూరులోని టీవీకే(TVK Party) ప్రధాన కార్యాలయంలో విజయ్ను కలుసుకుని పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ విజయ్ ప్రకటించారు.
TVK Party – Ex IRS Officer Joined
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అరుణ్ దేనని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పార్టీని పటిష్టం చేసి, పురోగమన దిశగా నడిపించాలని కూడా ఆయనకు సూచించినట్లు విజయ్ పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ న్యాయమూర్తి పార్టీలో చేరారు.
వారిలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఆర్.రాజలక్ష్మి, డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎస్.డేవిడ్ సెల్వన్, మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే, ద్రావిడ ముర్పోక్కు మక్కల్ కట్చి వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ.శ్రీధరన్, జేప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్, జేప్పియార్ రెబీబాయ్ విద్యా ట్రస్టు నిర్వాహక ట్రస్టీ డాక్టర్ ఎన్.మరియా విల్సన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి సి.సుభాష్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరందరినీ పార్టీ కండువా వేసి సభ్యత్వ కార్డులను అందజేశారు. పార్టీ శ్రేణులంతా సహాయ సహకారాలందించాలని విజయ్ విజ్ఞప్తి చేశారు.
Also Read : Union Minister Murugan : మోదీ 11 ఏళ్ల పాలన తర్వాత పేదరిక నిర్ములన కనిపిస్తుంది