Vijaya Sai Reddy : పురందేశ్వ‌రిపై విజ‌య సాయి సెటైర్

చంద్ర‌బాబుకు లోపాయికారి మ‌ద్ద‌తు

Vijaya Sai Reddy : అమ‌రావతి – బీజేపీ స్టేట్ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. త‌న‌తో పాటు సీఎం జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ‌స్తుండ‌డంతో తీవ్రంగా ప‌రిగ‌ణించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా టీడీపీ చేయొద్దంటూ ఆ పార్టీ చీఫ్ , స్కామ్ ల వీరుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఉచిత స‌ల‌హా ఇచ్చింది మీరేన‌ట అంటూ ఎద్దేవా చేశారు విజ‌య సాయి రెడ్డి.

Vijaya Sai Reddy Comments on Purandeswari

మీకు సంబంధించిన ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్న‌ట్టే అని అనుకుంటార‌ని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోందంటూ పేర్కొన్నారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎంపీ విజ‌య సాయి రెడ్డి(Vijaya Sai Reddy) స్పందించారు. బీజేపీ పార్టీలో ఉంటూ సామాజికవ‌ర్గ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

కేవ‌లం ప‌ద‌వుల కోస‌మే త‌ప్ప ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డ‌డం మీ ఇంటా వంటా లేదంటూ మండిప‌డ్డారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసినంత మాత్రాన అవి నిజాలై పోవ‌న్నారు విజ‌య సాయి రెడ్డి. ఇక‌నైనా ఇలాంటి అల‌వాట్లు మానుకోవాల‌ని సూచించారు. అయినా మొన్న‌టికి మొన్న కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ త‌ర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు. ఏదో స్టేట్ ప‌ద‌వి వ‌చ్చింద‌ని మిడిసి ప‌డుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

Also Read : Rahul Gandhi : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మాదే రాజ్యం

Leave A Reply

Your Email Id will not be published!