Vijayasai Reddy : తనకు లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంపై భగ్గుమన్న విజయసాయి రెడ్డి
కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరిపించాలని ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు...
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారాయన. కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ పోర్టును చంద్రబాబు ప్రైవేటుపరం చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కాకినాడ పోర్టును కేవీరావుకు కట్టబెట్టారని ఆరోపించారు. కేవీరావును దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారన్నారు.
Vijayasai Reddy Comment
కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరిపించాలని ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. కాకినాడ పోర్టుపై సీఐడీ కాకుండా సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్నారు. జగన్‌తో పాటు.. తనపై పగతోనే అక్రమ కేసులు పెడుతున్నారని విజయసాయి ఆరోపించారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్ల నుంచి కేవీరావు ఏం చేస్తున్నారని విజయసాయి ప్రశ్నించారు. చంద్రబాబు రాగానే ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు మరో నాలుగున్నరేళ్లు అధికారంలో ఉంటారన్న విజయసాయి.. తాము అధికారంలోకి వచ్చాక ఆయనకు జైలు తథ్యం అని వ్యాఖ్యానించారు. సింగపూర్‌లో బ్రోకర్ పనులు చేసే వ్యక్తి కేవీరావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేవీరావుపై హైకోర్టులో పరువునష్టం కేసు వేస్తానని అన్నారు విజయసాయి. తనకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తాను బయటకు వెళ్లాలంటే సీబీఐ అనుమతి అవసరం అని గుర్తు చేశారు. చంద్రబాబుపై న్యాయపరమైన చర్యలు చేపతామన్నారు. చంద్రబాబుకు పాలన చేతకాదని.. లోకేష్ అడ్మినిస్ట్రేటర్ కాదని వ్యాఖ్యానించారు. తండ్రి, కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంచి నాయకుడని ఈ సందర్భంగా విజయసాయి అన్నారు.
Also Read : CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన నాబార్డు చైర్మన్ షాజీ కృష్ణన్