Vijayasai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన సీఐడీ
మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చిన సీఐడీ
Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మంగళగిరి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీన విజయసాయి రెడ్డి మళ్లీ విచారణకు రావాలని నోటీసులో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్, సెజ్ షేర్లు అక్రమ బదిలీ వ్యవహారంలో గత బుధవారం విచారణకు సీఐడీ అధికారులు పిలిచిన విషయం తెలిసిందే. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి(Vijayasai Reddy) సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు. దీనితో విజయసాయి రెడ్డి మరోసారి సీఐడీ అధికారుల ముందు హాజరుకానున్నారు.
Vijayasai Reddy Got Notices from CID
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని గతంలో మంగళగిరి సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు, బలవంతంగా లాక్కున్నారా, బలవంతంగా తీసుకుంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే విషయాలపై అధికారులు విచారణ జరిపారు. కేవీ రావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డితో పాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి,ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రా ఉన్నారు.
గతంలో ఇచ్చిన నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లను సీఐడీ అధికారులు ప్రస్తావించారు. అయితే గత బుధవారం సీఐడీ(CID) విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి… ఈ కేసుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేసారు. అంతేకాదు ఈ కేసుకు కర్త కర్మ క్రియ అంతా కూడా వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి అని సీఐడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మాజీ సీఎం జగన్ కోటరీను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నాను అని ప్రకటించి… తన రాజ్యసభ సహా పలు పదవులకు, వైసీపీ పార్టీకు రాజీనామ చేసిన విజయసాయి రెడ్డి… తరువాత వైఎస్ జగన్ మరియు అతని కోటరీను ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అదే స్పీడు కొనసాగిస్తూ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికగా… మరోసారి కోటరీను ఉద్దేశ్యించి వ్యంగ్యాస్త్రాలు సంధించడమే కాకుండా మాజీ సీఎం జగన్ కు పలు సూచనలు చేసారు.
Also Read : Telangana High Court: పిటిషనర్ కు కోటి జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు