Vijayawada Floods : పడవల ద్వారా వరద బాధితులకు ఆహారం పంపిణీ..
కాగా... ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది...
Vijayawada : భారీ వర్షాలకు విజయవాడ వాసులు వణికిపోయారు. కుండపోత వర్షాలతో సింగ్‌నగర్‌లోని బుడమేరు మహోగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులుగా ప్రజలు బుడమేరు ముంపులోనే ఉండిపోయారు. అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఆహారం, మంచినీటిని పడవల ద్వారా బాధితులకు అందేలా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) మరికాసేపట్లో సింగ్‌నగర్‌కు రానున్నారు. ఈక్రమంలో సింగ్‌నగర్ ఫ్లైఓవర్ పై అన్ని రకాల వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఎవరైనా నడుస్తూ వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు తీరుపై వరద బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vijayawada Floods..
కాగా… ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకూ మహోగ్రరూపం చూపించిన బుడమేరుకు ఇవాళ వరద ఉధృతి కాస్త తగ్గింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. కుంభవృష్టి నమోదు కావడంతో బుడమేరు మహాగ్రరూపం దాల్చింది. ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లను వరద ముంచెత్తింది. 48 గంటలుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం వరద నీటిలోనే ఉండిపోయింది. చివరి వరకూ వారికి ప్రభుత్వ సహాయక చర్యలు అందలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా మకాం వేసినా కూడా చివరి వరకు సహాయం చేరలేదు. బుడమేరులో ప్రస్తుతం, 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read : AP Govt : వరద బాధితుల కోసం భారీగా ఆహార పదార్థాలు సిద్ధం చేసిన సర్కార్