Minister Rammohan Naidu : ఏవియేషన్ మంత్రిని కలిసిన విజయవాడ ఎంపీ
కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే...
Minister Rammohan Naidu : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడితో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. రామ్మోహన్ నాయుడికి వినతిపత్రం అందజేశారు. ఇవాళ పార్లమెంటులో రామ్మోహన్ నాయుడిని(Minister Rammohan Naidu) కలిసిన చిన్ని గన్నవరం ఎయిర్పోర్టు దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించాల్సిందిగా కోరారు. విజయవాడ నుంచి వారణాసి వయా వైజాగ్, విజయవాడ నుంచి కలకత్తా వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుండి అహ్మదాబాద్, విజయవాడ నుండి పుణే విమాన సర్వీసుల ప్రారంభించాలని ఎంపీ కేశినేని శివనాథ్.. రామ్మోహన్ నాయుడిని అభ్యర్థించారు.
Minister Rammohan Naidu Meet
ఇండిగో సంస్థ సర్వే చేసిన ఈ మార్గాల్లో విమాన సర్వీసులు తక్షణం ప్రారంభించేలా చూడాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఆయన అభ్యర్థనపై రామ్మోహన్ నాయుడు సైతం సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరపు రామ్మోహన్ నాయుడు(Minister Rammohan Naidu)కి లిఖిత పూర్వకంగా ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టడం రాష్ట్రానికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో విమానయాన రంగంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఇప్పటికే రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరోవైపు విజయవాడ ఎంపీగా విజయం సాధించిన తర్వాత కేశినేని చిన్ని సైతం తన జిల్లా కోసం శ్రమిస్తున్నారు. జిల్లాను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలని తపిస్తున్నారు. ఈక్రమంలోనే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభింపజేసేందుకు కృషి చేస్తున్నారు.
కేంద్రంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలుమార్లు హస్తినకు వెళ్లిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి బాగానే నిధులు రాబట్టగలిగారు. ఈ క్రమంలోనే పార్టీకి కేంద్ర మంత్రి పదవులను కూడా తీసుకొచ్చారు. కేంద్రం సపోర్టుతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం ఎయిర్పోర్టు దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తే బాగుంటుందని యోచిస్తున్నారు. విజయవాడ నుంచి వారణాసి వయా వైజాగ్, విజయవాడ నుంచి కలకత్తా వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి బెంగళూరు వయా హైదరాబాద్ లేదా కొచ్చి, విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుండి పుణే విమాన సర్వీసుల ప్రారంభించాలని రామ్మోహన్ నాయుడిని కేశినేని చిన్ని కోరారు. ఇది కానీ జరిగితే గన్నవరం ఎయిర్పోర్టు బాగా అభివృద్ధి చెందుతుంది.
Also Read : CM Revanth-Meet : తెలంగాణ కొత్త గవర్నర్ ‘జిష్ణుదేవ్ వర్మ’ ను కలిసిన సీఎం