Vikram Oberai : హొటల్స్ స్థాపించడం అదృష్టం
ఒబెరాయ్ గ్రూప్ చీఫ్ విక్రమ్ ఒబెరాయ్
Vikram Oberai : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమ హోటల్స్ సంస్థను విస్తరించడం ఆనందంగా ఉందన్నారు ఒబెరాయ్ గ్రూప్స్ చీఫ్ విక్రమ్ ఒబెరాయ్. ఆదివారం ఏపీలోని గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణం కోసం సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గండికోటతో పాటు తిరుపతి, అన్నవరంలలో త్వరలో ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు విక్రమ్ ఒబెరాయ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎంతో పాటు ఒబెరాయ్ హోటల్స్ సంస్థ చీఫ్ పాల్గొన్నారు.
రిసార్ట్స్ నిర్మాణం వల్ల ఎందరికో ఉపాధి కలుగుతుందన్నారు. హోటల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. పర్యాటక పరంగా కూడా మరింత అభివృద్ది చెందేందుకు మార్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు విక్రమ్ ఒబెరాయ్(Vikram Oberai).
గండికోట, అన్నవరం, తిరుపతి ప్రాంతాలన్నీ పుణ్య క్షేత్రాలకు దగ్గరలో కొలువై ఉన్నాయని దీని వల్ల వీటిని నిత్యం సందర్శించే భక్తులతో పాటు ప్రయాణీకులకు , పర్యాటకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు ఒబెరాయ్ హోటల్స్ సంస్థ అధినేత. రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వం సహకరిస్తే మరింతగా తమ హోటల్స్ ను విస్తరిస్తామని స్పష్టం చేశారు.
Also Read : Gudivada Amarnath : వెబ్ సీరీస్ లా పవన్ వారాహి యాత్ర