Vinayaka Chavithi : మరికొన్ని గంటల్లో ముస్లిం దేశాల్లో పూజలందుకోనున్న గణపయ్య

ప్రపంచంలోనే సాంకేతికలో ముందున్న దేశం జపాన్...

Vinayaka Chavithi : దేశవ్యాప్తంగా మరికొన్ని ఘడియల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే చవితి వేడుకల కోసం ఊరు వాడా భారీగా పందిళ్లు ఏర్పాటు చేశారు. చిన్న పెద్దలంతా వినాయకుడిని ప్రతిష్టించి.. పూజించేందుకు సిద్దమవుతున్నారు. ఈ వేడుకలు ఘనం నిర్వహించడం కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతుంది. అయితే ఈ వేడుకలు ఒక్క భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం ఇంకా చెప్పాలంటే.. ముస్లిం దేశాల్లో కూడా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. గణపతి బొప్ప మోరియా అంటూ పూజలందుకుంటున్నారు. ఇంతకీ ఆ దేశాలు ఏవో.. ఆ దేశ ప్రజలు విఘ్నేశ్వరుడిని ఏ పేరుతో పిలుస్తారో ఒక సారి పరిశీలిద్దాం….

Vinayaka Chavithi Special

జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలోనున్న ఇండోనేషియా(Indonesia)లో సైతం గణపతి పూజలందుకుంటున్నారు. 270 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశంలో 87 శాతం మంది ముస్లింలే. వారంతా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. అంతేకాదు.. ఆయన్ని ఎందుకు కొలుస్తున్నామో కూడా ఆ దేశ వాసులు ఈ సందర్భంగా సోదాహరణగా వివరిస్తున్నారు. గతంలో ఇండోనేషియా(Indonesia)లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 20 వేల రూపాయిల నోటుపై వినాయకుడి ఫొటోను ముద్రించింది. అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు పరిస్థితులు చక్కబడ్డాయి. దాంతో ఇండోనేషియా ప్రభుత్వానికే కాదు… ప్రజలకు సైతం గణపతిపై గురి కుదిరింది. అంతేకాదు.. విఘ్నేశ్వరుడు జ్జానానికి ప్రతీకగా విశ్వసిస్తామని ఆ దేశ వాసులు ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం.

ప్రపంచంలోనే సాంకేతికలో ముందున్న దేశం జపాన్. జపాన్ ప్రజలు సైతం గణపతిని పూజిస్తారు. ఆ దేశ ప్రజలు విఘ్నేశ్వరుడిని ‘కాంగిటెన్‌’ అని పిలుస్తారు. కాంగిటెన్ అంటే ఆనంద దేవుడని అర్థం. ఇక జపాన్‌లో వినాయకుడు అనేక రూపాల్లో పూజలందుకుంటారు. మరి ముఖ్యంగా నాలుగు చేతుల విఘ్నేశ్వరుడుని జపనీయులు అధికంగా ఆరాధిస్తారు. థాయ్‌లాండ్.. భారత్‌తో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా సంబంధమున్న దేశం. ఈ దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన విష్ణుమూర్తి కొలువు తీరిన అంగర్‌కోట్ దేవాలయం సైతం ఈ దేశంలోనే ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా ఖ్యాతీ గాంచింది.

అలాంటి ఈ దేశంలో గణపతిని ‘ఫ్రరా ఫికానెట్’ పేరుతో పూజిస్తారు. ఫ్రరా ఫికానెట్ అంటే .. అన్ని విఘ్నాలను తొలగించే దేవుడని ఆర్థం. ఈ దేశంలో ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా.. ముందుగా థాయ్‌లాండ్ వాసులు.. గణపతిని పూజించడం శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భారత్ పొరుగున్న దేశం శ్రీలంక. ఆ దేశంలో సైతం వినాయకుడికి దేవాలయాలున్నాయి. దేశంలోని వివిధ తమిళ వాసులు నివసించే ప్రాంతాల్లో నల్లరాతితో తయారు చేసిన గణపతిని పూజిస్తారు. శ్రీలంకలో గణపతిని ‘పిళ్ళయార్’‌గా కొలుస్తారు. ఆ దేశంలో పదుల సంఖ్యలో గణపతి దేవాలయాలున్నాయి. శ్రీలంకలో బౌద్ధ విహారాలు సైతం అధికంగా ఉన్నాయి. వాటిలో సైతం వినాయకుడిని సందర్శించవచ్చు.

Also Read : AP Weather : ఏపీకి మరో ముప్పు..బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

Leave A Reply

Your Email Id will not be published!