Vinayaka Laddu : గణేశుడి ప్రసాదం ముస్లింల స్వంతం
పలు చోట్ల మత సామరస్యానికి ప్రతీక
Vinayaka Laddu : ఆదిలాబాద్ – మతం, కులం, ప్రాంతాల పేరుతో కొట్టుకు చస్తున్న తరుణంలో ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు ముస్లింలు. కుల, మతాలు కేవలం రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రమే వర్తిస్తాయని తమకు అలాంటి ఆలోచనలు ఉండవని నిరూపించారు.
Vinayaka Laddu Viral in Adilabad
రాష్ట్రంలో ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. ఆయా ప్రాంతాలలో కొలువు తీరిన గణనాథుల వద్ద స్వామి వారి ప్రసాదాలు లడ్డూలను కైవసం చేసుకునేందుకు పోటీ పడ్డారు. హైదరాబాద్(Hyderabad) లోని బండ్లగూడలో ఏర్పాటు చేసిన వినాయకుడు లడ్డూను రూ. 1.26 కోట్లకు చేజిక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూను భారీ పోటీ మధ్య కైవసం చేసుకున్నారు.
తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 48 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా 21 కేజీల లడ్డూను పట్టణంలోని మహాలక్ష్మీ వాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ హాసిఫ్ లక్షా 2 వేల రూపాయలకు వేలంపాటలో చేజిక్కించుకున్నాడు.
మరో వైపు హైదరాబాద్ లోని శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో మహాలింగాపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ తాహెర్ అలీ రూ. 23,100కు లడ్డూ దక్కించుకున్నాడు. కుల, మతాలకు అతీతంగా తాను దీనిని తీసుకున్నానని తెలిపారు.
Also Read : Eatala Rajender : భాగ్యనగరం సంస్కృతికి దర్పణం