Vinesh Phogat Comment : ధిక్కార స్వ‌రం ఫోగ‌ట్ కు స‌లాం

ఎవ‌రీ వినేష్ ఏమిటా క‌థ

Vinesh Phogat Comment : అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌భుత్వం కొలువుతీరిన దేశ రాజ‌ధానిలో ఒక్క‌సారిగా క‌ల‌కలం మొద‌లైంది. దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తూ ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మ అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌తో జాతీయ ప‌తాకానికి గౌర‌వాన్ని తెస్తున్న అథ్లెట్లు ఒక్క‌సారిగా ధిక్కార స్వ‌రం వినిపించారు.

వారు ఆషామాషీ క్రీడాకారులు కాదు. ఎన్నో ప‌త‌కాలు తీసుకొచ్చారు. స‌మున్న‌త భార‌తావ‌ని త‌ల ఎత్తుకునేలా చేశారు. కానీ చివ‌ర‌కు త‌మ‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని, అండ‌గా ఉండాల్సిన వాళ్లే కాటు వేయాల‌ని చూస్తున్నారంటూ రోడ్డు మీద‌కు వ‌చ్చారు. 

దీంతో ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన నాయ‌కుడిగా పేరొందిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) సార‌థ్యంలోని బీజేపీ స‌ర్కార్ వెన్నులో వ‌ణుకు మొద‌లైంది.

ఇంత‌కూ ఇలా కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం భార‌తీయ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్. త‌నతో పాటు మ‌రో 30 మంది మ‌హిళా రెజ్ల‌ర్లు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై నిల‌దీసింది. ప్ర‌శ్నించింది. ఆపై త‌మ‌కు న్యాయం కావాలంటూ నిన‌దించింది.

ఆమె ఇవాళ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆమె ఆరోప‌ణ‌లు చేసింది ఎవ‌రో కాదు. భార‌త రెజ్లింగ్ సంఘం (డ‌బ్ల్యూఎఫ్ఐ) చీఫ్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్. గ‌త కొంత కాలంగా త‌మ‌ను లైంగిక వేధింపుల‌కు చేస్తున్నాడ‌ని, 

ఆయ‌న అండ చూసుకుని మిగ‌తా కోచ్ లో అత్యంత చెప్పు కోలేని రీతిలో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ, బూతులు మాట్లాడుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వినేష్ ఫోగ‌ట్(Vinesh Phogat) తో పాటు వీణా మాలిక్ , పూనియా కూడా ఉన్నారు.

వీరంతా జాతీయ స్థాయిలో, అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌త‌కాల‌ను భార‌త్ కు తీసుకు వ‌చ్చిన వారే. విచిత్రం ఏమిటంటే వినేష్ ఫోగ‌ట్ ఎవ‌రో కాదు లెజండ‌రీ రెజ్ల‌ర్ మ‌హావీర్ సింగ్ ఫోగ‌ట్ మేన కోడ‌లు. ఆమె నేరుగా ప్ర‌ధాన‌మంత్రికి, క్రీడా శాఖ మంత్రికి లేఖ‌లు రాశారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. దీంతో కేంద్రం దిగి వ‌చ్చింది. వివ‌ర‌ణ కోరింది సంస్థ‌ను. 72 గంట‌ల లోగా స‌మాధానం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. 

ఇదంతా ప‌క్క‌న పెడితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ 12 మంది అమ్మాయిల‌ను లైంగికంగా వేధించాడ‌ని వాపోయారు.

ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ సంద‌ర్శించారు. దీనిని సిగ్గు చేటు అంటూ పేర్కొన్నారు. నోటీసులు జారీ చేశారు. సింగ్ నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉందంటూ వాపోయారు వినేష్ ఫోగ‌ట్. 

ఇదిలా ఉండ‌గా ఫోగ‌ట్ రెజ్లింగ్ కుటుంబం నుంచి వ‌చ్చింది. 2014లో బంగారు ప‌త‌కాన్ని పొందారు. ఆసియా, కామ‌న్వెల్త్ గేమ్స్ లలో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన మొద‌టి భార‌తీయ మ‌హిళా రెజ్ల‌ర్. 

2019లో క‌జ‌కిస్తాన్ లో జ‌రిగిన పోటీల్లో కాంస్యాన్ని చేజిక్కించుకుంది. 2020లో రోమ్ లో జ‌రిగిన ఒక ఈవెంట్ లో 53 కేజీల విభాగంలో స్వ‌ర్ణం సాధించింది. త‌న విభాగంలో ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. అర్జున‌, ఖేల్ ర‌త్న పుర‌స్కారాలు అందుకుంది. 

యావ‌త్ భార‌త‌మంతా ఇప్పుడు వినేష్ ఫోగ‌ట్(Vinesh Phogat) ప్ర‌ద‌ర్శించిన తెగువ‌, ధిక్కార స్వ‌రాన్ని యావ‌త్ మ‌హిళా , క్రీడా లోకం హ‌ర్షిస్తోంది. లైంగిక వేధింపులు, హింస ఎప్ప‌టికీ ఆమోద యోగ్యం కాదు.

దీనిని బేష‌ర‌తుగా వ్య‌తిరేకించ‌డ‌మే కాదు తోటి అథ్లెట్ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నించింది. ఇవాళ వినేష్ ఫోగ‌ట్ ధీర వ‌నిత‌. ఆమెకు

తెలుగుఇజం స‌లాం చేస్తోంది విన‌మ్రంగా.

Also Read : రెజ్ల‌ర్ల నిర‌స‌న కేంద్రం స్పంద‌న

Leave A Reply

Your Email Id will not be published!