Vinod Roy : మ‌హిళా క్రికెట్ పై వినోద్ రాయ్ కామెంట్స్

వాళ్ల ప‌ట్ల ఫోక‌స్ పెట్ట‌లేక పోయాన‌ని ఆవేద‌న

Vinod Roy : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐకి సుప్రీంకోర్టు ద్వారా నియ‌మించిన క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్ల‌కు వినోద్ రాయ్(Vinod Roy)  చీఫ్ గా ప‌ని చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

బీసీసీఐలో తాను ఎలాంటి పాత్ర నిర్వ‌హించాన‌నే దానిపై రాయ్ పుస్త‌కం రాశారు. అది ఇప్పుడు పెను సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇదిలా ఉండ‌గా త‌న ప‌ద‌వీ కాలంలో ఎన్నో మార్పులు తీసుకు వ‌చ్చాన‌ని కానీ మ‌హిళా క్రికెట్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌లేక పోయాన‌ని వాపోయాడు.

2017 నుంచి 2019 మ‌ధ్య కొన‌సాగిన 33 నెల‌ల కాల వ్య‌వ‌ధి భార‌త క్రికెట్ లో అత్యంత ఇబ్బందులు ఎదుర‌య్యాయి. నాట్ జ‌స్ట్ ఎ నైట్ వాచ్ మ్యాన్ అనే పేరుతో పుస్త‌కం విడుద‌ల చేశాడు.

దేశంలోని మ‌హిళా క్రికెట్ ఎదుర్కొంటున్న విచిత్ర‌క‌ర‌మైన స్థితిని ఎత్తి చూపడం ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతోంది. త‌న ప‌ద‌వీ కాలంలో మ‌హ‌ళా క్రికెట్ ప‌ట్ల శ్ర‌ద్ద చూపించ లేద‌ని ఒప్పుకున్నాడు.

మ‌హిళా క్రికెట‌ర్లు ఉప‌యోగించిన జెర్సీల‌ను పురుషుల జెర్సీల నుంచి తిరిగి కుట్టంచారంటూ బాధ‌ను వ్య‌క్తం చేశాడు. మ‌హిళ‌, పురుషుల సంఘాన్ని విలీనం చేసేంత దాకా మ‌హిళా క్రికెట‌ర్లు చాలా ఇబ్బందులు ప‌డ్డార‌ని వాపోయాడు వినోద్ రాయ్(Vinod Roy).

శిక్ష‌ణ‌, కోచింగ్ స‌దుపాయాలు, క్రికెట్ గేర్, ప్ర‌యాణ సౌక‌ర్యాలు, మ్యాచ్ ఫీజులు, రిటైన‌ర్ల విష‌యానికి వ‌స్తే అమ్మాయిలు మ‌రింత మెరుగ్గా అర్హుల‌ని తాను న‌మ్ముతాన‌ని తెలిపాడు రాయ్. వాటిని స‌రిదిద్దేందుకు య‌త్నించామ‌ని తెలిపాడు.

2017లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకున్న‌ప్పుడు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ రికార్డు బ‌ద్ద‌లు కొట్టాకే మ‌హిళా క్రీడ‌పై ఆస‌క్తి పెరిగింద‌న్నాడు. ఆ మ్యాచ్ లో ఆమె 171 ర‌న్స్ చేసింది.

Also Read : చెన్నైకి చుక్క‌లు చూపించిన ర‌షీద్ ఖాన్

Leave A Reply

Your Email Id will not be published!