Vir Das Show Row : వీర్ దాస్ స్టాండప్ షో రద్దు
కమెడియన్ గా గుర్తింపు
Vir Das Show Row : ప్రముఖ కమెడియన్ స్టాండప్ షో తో పేరొందిన వీర్ దాస్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన తన షోను బెంగళూరులో నిర్వహించాల్సి ఉంది. హిందూ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో షోను రద్దు చేసినట్లు ప్రకటించారు నిర్వాహకులు.
ఇప్పటికే నవంబర్ 10 గురువారం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సి ఉంది. కానీ నిరసనలు, ఆందోళనలు కొనసాగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో షోను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని స్వయంగా వీర్ దాస్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం వీర్ దాస్ చేసిన ఈ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. కళాకారులకు ఈ దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు అవకాశం లేక పోవడం దారుణమని తోటి కళాకారులు వాపోయారు. వీర్ దాస్ స్టాండప్ షో ప్రత్యేకించి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ జరుగుతోందంటూ హిందూ వర్గాలు(Vir Das Show Row) ఆరోపించాయి.
హిందూవుల మనో భావాలను దెబ్బ తీసేలా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓ మిత వాద సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు షోను రద్దు చేసుకోవాల్సిందిగా స్టాండప్ కమెడియన్ కు సూచించారు. దీంతో ఏర్పాట్లు చేసుకున్న షోను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు వీర్ దాస్.
అనివార్య పరిస్థితుల కారణంగా షోను రద్దు చేయాల్సి వచ్చిందని, క్షమించమని కోరాడు వీర్ దాస్. కాగా హిందూ జన జాగృతి సమితి వైయాలికావల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Also Read : జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయొద్దు