Virat Kohli : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా కోహ్లీ
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , స్టార్ హిట్టర్ గా పేరొందిన విరాట్ కోహ్లీకి(Virat Kohli) మొదటిసారి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి నెలా ప్రకటించే అత్యుత్తమ ప్లేయర్ ను ప్రకటిస్తుంది.
గత నెల అక్టోబర్ నెలకు సంబంధించి ఐసీసీ పురుషుల విభాగానికి సంబంధించి రన్ మెషీన్ విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మంత్ -2022గా ప్రకటించింది.
ఇప్పటికే ఈ అవార్డు కు సంబంధించి ముందస్తుగా ముగ్గురు క్రికెటర్లను వెల్లడించింది. వారిలో విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా స్టార్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ , జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా ను పరిగణలోకి తీసుకుంది.
ఇదిలా ఉండగా ఇన్నేళ్ల కోహ్లీ కెరీర్ లో ఇదే మొదటిసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ కు ఎంపిక కావడం. ఇక నామినేట్ అయిన మొదటిసారే అవార్డు దక్కించు కోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ(Virat Kohli).
పొట్టి ఫార్మాట్ టి20లో గత కొంత కాలంగా అద్బుతమైన ఆట తీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడని, అందుకే కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించింది ఐసీసీ.
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు తరపున అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు రన్ మెషీన్ 246 పరుగులు చేశాడు. గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు కోహ్లీ.
Also Read : గుణతిలకపై శ్రీలంక బోర్డు నిషేధం
Congratulations to @imVkohli – ICC Player of the Month for October 👏👏#TeamIndia pic.twitter.com/IEnlciVt9T
— BCCI (@BCCI) November 7, 2022