Virat Kohli Fails : పేలవమైన ఆట తీరుతో పరేషాన్
రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి ఏమైంది
Virat Kohli Fails : ప్రపంచంలో ఎలాంటి మైదానంలోనైనా ఆడగలిగే సత్తా కలిగిన క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli Fails). ఆ మధ్యన ఫామ్ కోల్పోయాడు. ఆ తర్వాత తిరిగి కొంత మేర రాణించాడు. కానీ ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న సీరీస్ లలో అత్యంత పేలవమైన ఆట తీరుతో మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ఈ క్రికెట్ హీరో ప్రస్తుతం హాఫ్ సెంచరీ చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇది అతడి ఫ్యాన్స్ ను కూడా తీవ్ర నిరాశకు లోను చేస్తోంది.
గత 15 ఇన్నింగ్స్ లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేక పోయాడు. ఇప్పటికే భారీ ఎత్తున పరుగులు సాధించాడు. అటు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో మోత మోగించాడు. కానీ ఇటీవల రన్స్ చేసేందుకు ఆయాస పడుతున్నాడు. ఒక రకంగా ఫోకస్ పెట్టలేక ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు యువ ఆటగాళ్లు సవాల్ విసురుతున్నారు. అద్బుతంగా రాణిస్తుండడం కూడా కోహ్లీపై అధిక ఒత్తిడి ఉన్నట్లు అర్థమవుతోంది.
ఇప్పటికే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను బీసీసీఐ పక్కన పెట్టేసింది. ఏకంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో జట్టు నుంచి పీకి పారేసింది. దీన్ని బట్టి చూస్తే రెడ్ బెల్స్ మోగుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం ఇన్నింగ్స్ లు కలిపి 111 రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). టెస్టులో ఫామ్ కొనసాగించలేక పోవడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
విచిత్రం ఏమిటంటే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఫెయిల్ అవుతుండడం విస్తు పోయేలా చేస్తోంది. ఇకనైనా నాలుగో టెస్టులో రాణిస్తే బెటర్ లేకుంటే కష్టమే.
Also Read : ఉజ్జయిని గుడిలో కోహ్లీ..అనుష్క