Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , రన్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా మరో చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆరో బ్యాటర్ గా నిలిచాడు కోహ్లీ. దీంతో ఏడో స్థానంలో నిలిచాడు ప్రస్తుత భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 82 పరుగులు చేశాడు. అజేయంగా నిలిచాడు. జట్టుకు కీలకమైన విజయాన్ని తెచ్చి పెట్టాడు కోహ్లీ.
దీంతో ఇప్పటి వరకు క్రికెట్ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ ను దాటేశాడు విరాట్ కోహ్లీ. దీంతో ఏడవ స్థానానికి పడి పోయాడు రాహుల్ ద్రవిడ్. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ(Virat Kohli) మొత్తం 528 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 53.80 సగటుతో 24,212 పరుగులు చేశాడు.
ఇందులో 71 సెంచరీలు, 126 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ఇదిలా ఉండగా రాహుల్ ద్రవిడ్ మొత్తం 509 మ్యాచ్ లు ఆడి 45.41 సగటుతో 24,208 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 270 పరుగులు ఉండడం విశేషం. ఏది ఏమైనా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రికార్డులను బద్దలు కొట్టడం మామూలే.
Also Read : మహీంద్రా ట్వీట్ ‘లుంగీ డ్యాన్స్’ వైరల్