Virat Kohli Record : అరుదైన రికార్డ్ కు చేరువ‌లో కోహ్లీ

64 ర‌న్స్ చేస్తే చాలు స‌చిన్ స‌ర‌స‌న

Virat Kohli Record : ఒక్క‌డు 10 వేల ప‌రుగులు చేస్తే చాలు అనుకున్నాం. కానీ ఏకంగా 25 వేల ప‌రుగులు అంటే మామూలు మాట‌లా. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ క్రికెట్ లో ఆ ఒకే ఒక్క‌డు ఎవ‌రో కాదు ముంబైకి చెందిన స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్. ఆ త‌ర్వాత సీన్ మారింది. క్రికెట్ ఫార్మాట్ మారింది. ఇప్పుడు రూల్స్ మారాయి.

పొట్టి ఫార్మాట్ ఎంట్రీ ఇవ్వ‌డంతో క్రికెట్ స్వ‌రూపం కోట్లాది మంది అభిమానుల‌ను తెచ్చి పెట్టేలా చేసింది. ఇదిలా ఉండ‌గా స్వ‌దేశంలో ఫిబ్ర‌వ‌రి 9 నుంచి మ‌రో సీరీస్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే భార‌త్ , ఆస్ట్రేలియా జ‌ట్లు త‌మ టీమ్ ల‌ను ప్ర‌క‌టించాయి.

అయితే అరుదైన రికార్డ్ కు చేరువ‌లో ఉన్నాడు ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Record). త‌న కెరీర్ లో కేవలం 64 ప‌రుగులు చేస్తే చాలు క్రికెట్ రారాజు గా పేరొందిన స‌చిన్ టెండూల్క‌ర్ పేరు మీద ఉన్న రికార్డ్ బ‌ద్ద‌ల‌వుతుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లు క‌లిపి విరాట్ కోహ్లీ 546 ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇందులో మొత్తం 24,936 ర‌న్స్ చేశాడు. ఇక క్రికెట్ ఫార్మాట్ లో అత్యంత వేగంగా 25 వేల ప‌రుగులు చేసిన క్రికెట‌ర్ గా చ‌రిత్ర సృష్టించనున్నాడు విరాట్ కోహ్లీ.

ఇక మాజీ క్రికెటర్ స‌చిన్ కు 24 వేల రన్స్ చేసేందుకు 543 ఇన్నింగ్స్ లు ప‌ట్టాయి. ఆసిస్ మాజీ స్కిప్ప‌ర్ రికీ పాంటింగ్ కు 565 ఇన్నింగ్స్ లు , ద‌క్షిణాఫ్రికా మాజీ ప్లేయ‌ర్ జాక్ క‌లిస్ కు 573 , శ్రీ‌లంక మాజీ కెప్టెన్ కుమార సంగ‌క్క‌ర‌కు 591 ఇన్నింగ్స్ లు ప‌ట్టాయి. ఇక స‌చిన్ ఇప్ప‌టి దాకా 782 ఇన్నింగ్స్ ల‌లో 34,357 ర‌న్స్ చేశాడు. సంగ‌క్క‌ర 666 ఇన్నింగ్స్ ల‌లో 25,957 ర‌న్స్ చేశాడు.

Also Read : మాతో ఆడ‌క పోతే మేం మీతో ఆడం

Leave A Reply

Your Email Id will not be published!