Anushka Sharma : అనుష్క చాలా హాట్ గురూ

కోహ్లీ..అనుష్క ఫోటోలు వైర‌ల్

Anushka Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్. భార‌త క్రికెట్ జ‌ట్టుకు సుదీర్ఘ కాలం పాటు స్కిప్ప‌ర్ గా ఉన్నాడు. ఎన‌లేని విజ‌యాలు అందించాడు.

ప్ర‌పంచ క్రికెట్ లో టాప్ 5 లో ఒక‌డిగా ఉన్నాడు కోహ్లీ. ఇదిలా ఉండ‌గా తాజాగా తాను ప్రాణ‌ప‌దంగా ప్రేమించే అనుష్క శ‌ర్మ‌తో( Anushka Sharma) క‌లిసి ఫోటోలు దిగాడు. ఈ సంద‌ర్భంగా త‌న భార్య‌ను ఉద్దేశించి చాలా హాట్ గురూ అంటూ కామెంట్ చేశాడు.

ప్ర‌స్తుతం విరాట్ చేసిన కామెంట్స్ హాల్ టాపిక్ గా మారాయి. మెరిసే బాడీ హ‌గ్గింగ్ డ్రెస్ లో అనుష్క శ‌ర్మ Anushka Sharma)చిందులు వేయ‌డం వైర‌ల్ గా మారింది. కొద్ది సేప‌టి కింద అనుష్క శ‌ర్మ త‌న భ‌ర్త కోహ్లీతో క‌లిసి అభిమానులు ఆక‌ట్టుకునేలా ఫోటోలు దిగారు.

ఉఫ్ఫ్ టూ హాట్ అంటూ కామెంట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్రేమ‌తో నిండిన‌, వెలుగుతున్న రెండ్ హార్ట్ ఎమోజీలు కూడా ఉన్నాయి. కోహ్లీ న‌లుపు రంగు ట‌క్సేడేలో అందంగా క‌నిపించాడు.

వీరిద్ద‌రి ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. జోయా అక్త‌ర్ తో పాటు ప‌లువురు వీరిద్ద‌రి ఫోటోల గురించి కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండ‌గా కోహ్లీ, అనుష్క శ‌ర్మ ల ఫోటోలకు కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి.

ఇదిలా ఉండ‌గా కొన్నాళ్లు వీరిద్ద‌రూ డేటింగ్ చేసిన 2017లో పెళ్లి చేసుకున్నారు. కాగా అనుష్క శ‌ర్మ చివ‌రి సారిగా 2018లో షారుఖ్ ఖాన్ , కైఫ్ ల‌తో క‌లిసి జీరోలో న‌టించింది. ఝుల‌న్ గోస్వామి జీవితం ఆధారంగా చ‌క్దా ఎక్స్ ప్రెస్ తో సినిమాతో తిరిగి వ‌స్తోంది.

Also Read : కేకేఆర్ గెలుపులో ఉమేష్ కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!