Virender Sehwag : జితేశ్ శ‌ర్మ‌పై వీరూ కామెంట్

క్రికెట‌ర్ పై ప్ర‌శంస‌ల జల్లు

Virender Sehwag : ఇప్ప‌టి దాకా భార‌త జ‌ట్టులో వికెట్ కీప‌ర్లు అనే స‌రిక‌ల్లా ధోనీ, ద్ర‌విడ్ గుర్తుకు వ‌చ్చే వాళ్లు. ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్ లో వికెట్ కీప‌ర్లుగా , బ్యాట‌ర్లుగా రాణిస్తున్నారు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంసన్ , ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఇషాన్ కిష‌న్ , జితేశ్ శ‌ర్మ కీప‌ర్లుగా రాణిస్తూ స‌త్తా చాటుతున్నారు.

తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. రిష‌బ్ పంత్ , ఇషాన్ కిషన్ కంటే జితేశ్ శ‌ర్మ పై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించాడు వీరూ. ఈ మ‌ధ్య కాలంలో త‌న‌ను ఎక్కువ‌గా ఈ యువ క్రికెటర్ ఆక‌ట్టుకున్నాడ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు.

ఇదిలా ఉండ‌గా ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ లో పెద్ద ఎత్తున యువ ఆటగాళ్లు స‌త్తా చాటుతున్నారు. ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. ఓ వైపు యువర‌క్తం ఉర‌క‌లేస్తుంటే సీనియ‌ర్లు త‌మ అనుభ‌వాన్ని జోడించి క‌ళ్లు చెదిరేలా ఆడుతున్నారు.

ఈసారి ఐపీఎల్ లో జ‌మ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బౌలింగ్ తో యావ‌త్ క్రీడా లోకాన్ని విస్తు పోయేలా చేశాడు. కొత్తగా ఏప్రిల్ లో ఎంట్రీ ఇచ్చిన ఆట‌గాళ్లు దంచి కొడుతున్నారు.

రాకెట్ లాంటి బంతుల‌తో మిస్సైల్స్ కంటే వేగంగా బౌలింగ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా మాలిక్ గంట‌కు 157 కిలోమీట‌ర్ల వేగంతో వేస్తూ చ‌రిత్ర సృష్టించాడు.

క్రిక్ బ‌జ్ తో వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) మాట్లాడాడు. ఎలాంటి బెంకు లేకుండా స్వేచ్ఛ‌గా ఆడుతున్నాడ‌ని కితాబు ఇచ్చాడు.

 

Also Read : గుర్తింపు లేక‌నే ఐపీఎల్ కు దూరం

Leave A Reply

Your Email Id will not be published!