Vladimir Putin : శాంతి చర్చలకు సిద్ధమంటూ కీలక ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు

అయితే ఉక్రెయిన్‌ లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే మా ప్రధాన లక్ష్యమని పుతిన్ అన్నారు...

Vladimir Putin : గత రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గత నెలలో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా శాంతి కోసం ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో శాంతి చర్చలు చేసేందుకు భారతదేశం సిద్ధంగా ఉందన్నారు. ఆ క్రమంలో ఉక్రెయిన్‌ శాంతి చర్చలకు అంగీకరించింది. ఇప్పుడు తాజాగా రష్యా కూడా తొలిసారిగా చర్చలకు ఓకే చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటివల రష్యా, ఉక్రెయిన్‌లను సందర్శించిన తర్వాత రెండు దేశాల నుంచి శాంతి చర్చల కోసం ప్రకటన రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో భాగంగా భారతదేశం, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) గురువారం ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలిపారు.

Vladimir Putin Comment

అయితే ఉక్రెయిన్‌ లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే మా ప్రధాన లక్ష్యమని పుతిన్ అన్నారు. ఈ క్రమంలోనే రష్యా సైన్యం క్రమంగా ఉక్రేనియన్ సైన్యాన్ని కుర్స్క్ నుంచి వెనక్కి పంపుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో యుద్ధానికి సంబంధించి ప్రాథమిక ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం ఎప్పుడూ అమలు కాలేదని పుతిన్ చెప్పారు. ఇప్పుడు మధ్యవర్తిత్వ చర్చలు మళ్లీ ప్రారంభమైతే ఇస్తాంబుల్‌లో కుదిరిన ప్రాథమిక ఒప్పందం ఈ చర్చలకు ఆధారం కావచ్చు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతుంది.

ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ శాంతి చర్చలలో రష్యా పాల్గొనకపోవడం వల్ల ఈ సమావేశాలు ఎటువంటి సానుకూల ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పుడు పుతిన్(Vladimir Putin) స్వయంగా చర్చలకు సిద్ధమని సూచించడం విశేషం. కానీ యుద్ధాన్ని ఆపేందుకు రష్యా విధించిన షరతుల ప్రకారం డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. అలాగే ఉక్రెయిన్ ఎప్పటికీ నాటోలో భాగంగా ఉండకూడదు. అయితే ఈ ఉక్రెయిన్ నిబంధనలను అంగీకరించడానికి నిరాకరించింది. ఉక్రెయిన్ నుంచి రష్యా తన దళాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

Also Read : AP Home Minister : గండి కొట్టడానికి గేట్లు ఎత్తడానికి తేడా తెలియని వ్యక్తి మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!