Jonita Gandhi : ఎవరీ పిల్ల తెమ్మర. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోకిలమ్మ. స్వర సంచారంలో దుమ్ము రేపుతూ హృదయాలు కొల్లగొడుతోంది. తాజాగా విజయ్ నటించిన బీస్ట్ అరబిక్ కుత్తు సాంగ్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.
ఆ పాటకు సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తే దానిని అనిరుధ్ తో సులభంగా, ఆకట్టుకునేలా పడింది జోనితా గాంధీ.
లవర్స్ డేను పురస్కరించుకుని మూవీ మేకర్స్ ఈ సాంగ్ ను విడుదల చేశారు.
మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకు పోతోంది ఈ పాట. జోనితా గాంధీ భారత దేశంలో జన్మించిన కెనడియన్ సింగర్. బహు భాషా గాయనిగా పేరు తెచ్చుకుంది.
తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, హిందీ, తమిళం, పంజాబీ లో లెక్కలేనన్ని పాటలు పాడింది.
యూట్యూబ్ ద్వారా కోట్లాది మందిని మెస్మరైజ్ చేసింది జొనితా గాంధీ(Jonita Gandhi).
తొలిసారిగా చెన్నై ఎక్స్ ప్రెస్ టైటిల్ ట్రాక్ ద్వారా కెరీర్ స్టార్ట్ అయ్యింది.
ఢిల్లీకి చెందిన పంజాబీ కుటుంబంలో పుట్టింది. తొమ్మిదేళ్లప్పుడు కెనడాకు వెళ్లింది ఆమె కుటుంబం. అక్కడే ఆమె పెరిగింది.
తండ్రి దీపక్ గాంధీ సంగీతకారుడు. ఆమెకు సంగీతం పట్ల ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించాడు.
జొనితా గాంధీ పాశ్చాత్య, హిందూస్తానీ శాస్త్రీయ గానంలో శిక్షణ పొందింది. తండ్రి, సోదరులతో కలిసి ఈవెంట్స్ లో పాల్గొంది.
ఆకాశ్ గాంధీతో కలిసి సాంగ్స్ చేసింది. యూట్యూబ్ లో ఆమె పాడిన పాటలు హిట్ గా నిలిచాయి.
పానీ ద రంగ్ , తుజ్ కో పాయా, తుమ్ హి హూ, సుహానీ రాత్ , యే హోన్నా, ఇతర ప్రసిద్ద సాంగ్స్ పాపులర్ అయ్యేలా చేశాయి.
సోను నిగమ్ తో కలిసి రష్యా, యూకె, యూఎస్, కేరిబియన్ దేశాలలో పర్యటించింది. బాలీవుడ్ లోకి ఎంటరైంది. దీపికా పదుకొనే, షారుఖ్ ఖాన్ నటించిన మూవీతో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పలు సినిమాలకు పాడింది.
ఏఆర్ రెహమాన్ , ప్రీతమ్ తో కలిసి పాడింది. ఎంటీవీలో అన్ ప్లగడ్ ద్వారా ప్రదర్శన ఇచ్చింది. 2020లో స్టార్ ప్లస్ లో పిల్లలు పాడే తారే జమీన్ పర్ కు జడ్జిగా వ్యవహరించింది.
తాజాగా అరబిక్ కుతు సాంగ్ తో మరోసారి సత్తా చాటింది జొనితా గాంధీ. కష్టమైన పదాలను చాలా సులభంగా పాడి మనసులు దోచుకుంది.
Also Read : కాంగ్రెస్ నిలిచేనా ఆప్ గెలిచేనా