Vundavalli Arun Kumar : ఏపీ డిప్యూటీ సీఎంకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ

కాగా..ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది...

Vundavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. మీ శ్రేయోభిలాషి అంటూ లేఖలో సంబోధించారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌లు పలుమార్లు ప్రస్తావించారని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేదే తన వాదన అని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు బీజేపీతో కలిసి పనిచేయటం వల్ల రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవటానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవటానికి ఇదే సరైన సమయమని అన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు, ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలన్నారు. సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) కోరారు.

Ex MP Vundavalli Arun Kumar Letter to..

కాగా..ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు రావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన పోలీసులు పురోగతి సాధించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నూక మల్లికార్జున్ అని, మానసిక స్థితి సరిగ్గా లేదని, మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో వైజాగ్‍లో నూక మల్లికార్జున్‍పై 354 కేసు నమోదైంది.

Also Read : Minister Anam : రెవిన్యూ రికార్డుల్లో అవకతవకలపై వైసీపీపై భగ్గుమన్న మంత్రి ఆనం

Leave A Reply

Your Email Id will not be published!