VVS Laxman : భారత జట్టు కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్
ఆసియా కప్ జట్టుకు రాహుల్ ద్రవిడ్
VVS Laxman : ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా పేరొంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి. కానీ నిర్ణయాలు మాత్రం ఎందుకు తీసుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
వరల్డ్ క్రికెట్ లో ఏ దేశ క్రికెట్ బోర్డు జట్టు కెప్టెన్లను మార్చ లేదు. ఇప్పటి వరకు ఏడుగురిని మార్చేసింది. ఇప్పటికే వన్డే జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను ఎంపిక చేసింది.
కానీ ఏమైందో ఏమో కానీ గాయం కారణంగా దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి రావడంతో అతడికి కెప్టెన్సీగా చాన్స్ ఇచ్చింది. దీంతో డిప్యూటీ పదవి తీసుకోవాల్సి వచ్చింది ధావన్ కు.
కేఎల్ రాహుల్ నాయకత్వం వహించిన మ్యాచ్ లలో భారత్ పరాజయం పాలైంది. ఇక శిఖర్ నేతృత్వం వహించిన మ్యాచ్ లు గెలుపొందడం విశేషం.
తాజాగా భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందుకు సంబంధించి జట్టును డిక్లేర్ చేసింది. ఇక ఆసియా కప్ లో పాల్గొనే జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉండగా బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
టీమిండియాకు కోచ్ గా క్రికెట్ అకాడెమీ డైరెక్టర్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు అధికారికంగా బీసీసీఐ వెల్లడించింది.
జింబాబ్వే జట్టుతో చివరి వన్డే 22న ఉంది. ఆగస్టు 27న ఆసియా కప్ ప్రారంభం అవుతుంది. మార్పు చేసినట్లు తెలిపారు జే షా.
మొత్తంగా ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి నెలకొంది.
Also Read : దాయాదుల పోరుపై పాంటింగ్ కామెంట్