VVS Laxman : కరోనా ఎఫెక్ట్ కోచ్ గా లక్ష్మణ్ కు చాన్స్
ఆసియా కప్ 2022 ఇండియా జట్టుకు
VVS Laxman : ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. కీలకమైన పోరు ఆగస్టు 28న పాకిస్తాన్, భారత జట్ల మధ్య జరగనుంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆయా దేశాలలో మ్యాచ్ లు జరగడం లేదు.
కేవలం తటస్థ వేదికల మీదనే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఇదిలా ఉండగా బీసీసీఐకి కోలుకోలేని షాక్ తగిలింది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ ద్రవిడ్ కు టెస్టుల్లో కరోనా పాజిటివ్ తేలింది.
దీంతో జింబాబ్వే జట్టుకు తాత్కాలిక కోచ్ గా ఉన్న ఇండియన్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న వంగీపురం వెంకట సాయి లక్ష్మణ్ ను (VVS Laxman) రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఆసియా కప్ 2022 టోర్నీ కోసం హెడ్ కోచ్ గా నియమించింది బీసీసీఐ.
ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతానికి సహాయక కోచ్ గా ఉన్న పారస్ మాంబ్రే ఇన్ చార్జీ కోచ్ గా లక్ష్మణ్ బయలు దేరేంత వరకు ఉంటారని సమాచారం.
అయితే హరారే నుంచి నేరుగా పంపిస్తారా లేక మాంబ్రేనే ఉంచుతారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు శ్రీలంక, జింబాబ్వే టూర్ లకు భారత జట్టుకు తాత్కాలిక కోచ్ గా వ్యవహరించాడు లక్ష్మణ్. ఇదిలా ఉండగా ఆసియా కప్ సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది.
Also Read : ‘చాహల్..ధనశ్రీ’ హల్ చల్