Virender Sehwag : ఢిల్లీ ఓట‌మికి వార్న‌రే కార‌ణం – సెహ్వాగ్

ఐపీఎల్ లో ఎందుకు ఆడ‌డం

Virender Sehwag : భార‌త మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) నిప్పులు చెరిగారు. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో గౌహ‌తి వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 57 ర‌న్స్ తేడాతో ఓట‌మి పాలైంది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు సెహ్వాగ్. ఢిల్లీ ఓడి పోయేందుకు ప్ర‌ధాన కార‌ణం డేవిడ్ వార్న‌ర్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. విచిత్రం ఏమిటంటే వార్న‌ర్ ఒక్క‌డే జ‌ట్టులో బాగా ఆడాడు. 65 ర‌న్స్ కూడా చేశాడు. పేల‌వ‌మైన కెప్టెన్సీతో డేవిడ్ జ‌ట్టుకు భారంగా మారాడ‌ని పేర్కొన్నాడు.

ఇలాగేనా జ‌ట్టును న‌డిపించేది అంటూ మండిప‌డ్డాడు. టాస్ గెలిచిన డేవిడ్ వార్న‌ర్ ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఉంటే బావుండేద‌న్నాడు. ఇప్ప‌టికే ఐపీఎల్ లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని ఇలాగైతే జ‌ట్టు కోలుకోవ‌డం కష్ట‌మ‌ని హెచ్చ‌రించాడు. రిష‌బ్ పంత్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని తెలిపాడు. టెస్టు జ‌ట్టు కోసం ఆడుతున్న‌ట్లు వార్న‌ర్ ఆడుతున్నాడంటూ ఎద్దేవా చేశాడు. ఇది టి20 ఫార్మాట్ అని కూడా మ‌రిచి పోతే ఎలా అని ఫైర్ అయ్యాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో య‌శ‌స్వి జైశ్వాల్ 25 బంతులు ఎదుర్కొని 60 ర‌న్స్ చేస్తే అదే ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్కిప్ప‌ర్ వార్న‌ర్ 55 బంతులు ఆడి 65 ర‌న్స్ చేశాడ‌ని ఇలాగైతే ఎలా అని ప్ర‌శ్నించాడు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag). ఇక‌నైనా జైశ్వాల్ , జోస్ బ‌ట్ల‌ర్ ను చూసి నేర్చుకోవాల‌ని సూచించాడు.

Also Read : వెల్ డ‌న్ బాయ్స్ – సంగ‌క్క‌ర‌

Leave A Reply

Your Email Id will not be published!