Wasim Jaffer : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, మాజీ కోచ్ వసీం జాఫర్ (Wasim Jaffer)సంచలన కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ భవిష్యత్తులో ఉత్తమమైన కెప్టెన్ కాగలడని పేర్కొన్నాడు.
ఇటీవల నమోదు చేస్తున్న విజయాల క్రెడిట్ అంతా రోహిత్ శర్మదేనని స్పష్టం చేశాడు. విరాట్ కంటే మెరుగైన టెస్ట్ లీడర్ గా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు.
అయితే గాయాలు రోహిత్ శర్మను ఎక్కువగా వేధిస్తున్నాయని వాటిని పక్కన పెట్టి కంటిన్యూగా ఆడితే గనుక రికార్డులు నమోదు చేయడం ఖాయమన్నాడు వసీం జాఫర్.
స్వదేశంలో జరిగిన వెస్టిండీస్, శ్రీలంక టీ 20, వన్డే, టెస్టు సీరీస్ లను చేజిక్కించుంది భారత జట్టు. ఈ తరుణంలో విజయవంతమైన నాయకుడిగా పేరొందాడు రోహిత్ శర్మ.
మొత్తంగా చూస్తే హోమ్ సీజన్ లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోలేదని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు వసీం జాఫర్(Wasim Jaffer). భారత జట్టు అన్ని ఫార్మాట్ లలో ఆడిన 14 మ్యాచ్ లలో విజయం సాధించింది.
రెండు మ్యాచ్ ల టెస్టు సీరీస్ లో టీమిండియా 2-0 తో శ్రీలంకను ఓడించింది. ఇక శ్రీలంపై ఈ గెలుపుతో భారత ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ స్టాండింగ్స్ లో నాలుగో స్థానానికి చేరింది.
ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ లో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఎన్ని మ్యాచ్ లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడనేది ఇప్పుడే చెప్పలేను. కానీ మ్యాచ్ లు గనుక ఆడితే మాత్రం అతను సక్సెస్ ఫుల్ నాయకుడు అవుతాడని చెప్పగలనన్నాడు వసీం జాఫర్.
Also Read : క్రికెట్ లో బాబర్ టాప్ బ్యాటర్