Weather Alert : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు....
Weather Alert : రెండు మూడు రోజులకు ఒక్కసారైనా వస్తున్న వానలతో ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ప్రజలకు షాకింగ్ చెప్పింది ఏపీ వాతావరణ శాఖ. రాష్ట్రంపై మళ్లీ భానుడి ప్రతాపం చూపించబోతున్నాడని. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతం అయ్యిందని.. ప్రస్తుతం ఈశాన్య దిశగా కదులుతోందని.. రానున్న రెండు రోజుల్లో అది వాయుగుండంగా మారుతోంది.
Weather Alert in AP
ఆ తరువాత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్(AP)పై లేదని.. పశ్చిమ బెంగాల్‌పై మాత్రమే. ఈ కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఏ దశలో ప్రయాణిస్తే.. ఆ ప్రభావిత రాష్ట్రాల్లో మాత్రమే వర్షాలు పడతాయని అన్నారు.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మినహా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులు ఎండలు పెరిగే అవకాశం ఉంది. అయితే, రానున్న ఐదు రోజుల్లో ఏపీలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
Also Read : Rahul Gandhi : ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ