Chennai Rains : చెన్నైలో మరో మూడు రోజులు వర్షాలు తప్పవంటున్న వాతావరణ శాఖ

చెన్నైలో మరో మూడు రోజులు వర్షాలు తప్పవంటున్న వాతావరణ శాఖ..

Chennai Rains : తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పవాయుపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావంతో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తాయని, సముద్రతీర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

Chennai Rains Update

గురు, శుక్రవారాల్లో పుదుచ్చేరి, కారైక్కాల్‌ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటన జారీ చేసింది. ఇక రాజధాని నగరంలో చెన్నై మరో 48 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోను, పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also Read : CM MK Stalin : అమెరికా పర్యటనలో సీఎం స్టాలిన్ విమానానికి బాంబు బెదిరింపులు

Leave A Reply

Your Email Id will not be published!