Bengal Train Accident : వెస్ట్ బెంగాల్ రంగపాణి స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం
ఈ ప్రమాదంలో రెండు ప్రయాణీకుల బోగీలు, ఒక పార్శిల్ బోగీ దెబ్బతిన్నట్లు రైల్వేశాఖ నుంచి సమాచారం అందింది...
Bengal Train Accident : పశ్చిమ బెంగాల్‌లోని రంగపాణి స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది ప్రయాణికులు మృతి చెందగా, 20 నుంచి 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Bengal Train Accident Updates
అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ సిలిగురి దాటిన తర్వాత రంగపాణి స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు వెనుక భాగంలో ఉన్న మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ప్రయాణీకుల బోగీలు, ఒక పార్శిల్ బోగీ దెబ్బతిన్నట్లు రైల్వేశాఖ నుంచి సమాచారం అందింది. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడగా, క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళ్లారు. రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించి X వేదికగా ఓ పోస్ట్ చేశారు. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన విషాద రైలు ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ అయ్యానని తెలిపారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో DM, SP, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయని, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.
Also Read : CBN Tour : నిలిచిపోయిన ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరిన బాబు