WFI Chief Demands : నార్కో టెస్టుకు నేను రెడీ వాళ్లు రెడీనా
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ షాకింగ్ కామెంట్స్
WFI Chief Demands : తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజ్లర్లు డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ ,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్(WFI Chief ) పై ఆరోపణలు చేశారు. ఈ మేరకు గత ఏప్రిల్ 23 నుండి దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. కానీ ఎంతకూ దిగి రావడం లేదు సింగ్. తాను కింగ్ నని, ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశాడు. ఒకవేళ ప్రధాని మోదీ కోరితే తాను రాజీనామా చేస్తాను తప్ప ఇంకెవ్వరూ చెప్పినా తాను పదవి నుంచి తప్పుకోనని ప్రకటించాడు.
ఇదిలా ఉండగా మహిళా రెజ్లర్లకు సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు ప్రకటించింది. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ ముందు తాము ఆందోళన చేపడతామని హెచ్చరించింది. అంతే కాకుండా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నార్కో టెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించారు సింగ్. తాను నార్కో టెస్టు చేయించు కునేందుకు సిద్దంగా ఉన్నానని కానీ ఒక షరతు విధించారు. అదేమిటంటే తనతో పాటు తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ , భజరంగ్ పునియా కూడా నార్కో టెస్టుకు హాజరు కావాలని మెలిక పెట్టారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
హర్యానాలోని మహా పంచాయత్ చేపట్టారు రైతులు. ఈ మేరకు సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేశారు. ఆయనను తొలగించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే రైతుల ఆందోళనకు దిగి వచ్చింది మోదీ సర్కార్. ఆ రైతులే ఇప్పుడు రెజ్లర్ల ఆందోళనకు మద్దతు పలకడం విశేషం.
Also Read : Ravichandran Ashwin
