Congress Loss : యాత్ర సరే ఓటమి మాటేంటి
రేవంత్ రెడ్డికి ఇది రెండో ఓటమి
Congress Loss : దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. 137 ఏళ్ల వయసు కలిగిన ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కూడా ఉంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలంగాణలో పార్టీకి మంచి పట్టుంది. ఇదే క్రమంలో సీనియర్ల మధ్య సయోధ్య లేక పోవడం, ఆధిపత్య పోరు కొనసాగడం ఆ పార్టీకి శాపంగా మారింది.
తెలంగాణలో ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా సమన్వయ లోపం శాపంగా పరిణమించింది. ఎప్పుడైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమటీకి చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చారో ఆనాటి నుంచి పార్టీలో జోష్ పెరిగింది. కానీ మాటల దూకుడు పెంచడం తప్ప క్యాడర్ లో బలాన్ని కలిగించిన దాఖలాలు లేవన్న విమర్శలు లేక పోలేదు.
రేవంత్ రెడ్డిపై స్వంత పార్టీకి చెందిన సీనియర్లు ఆరోపణలు చేయడం, మరికొందరు బయటకు వెళ్లి పోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు.
కానీ ఉన్నత పదవులు లేదా కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గం చేతుల్లో ఉండడం తీవ్ర ఇబ్బందులు కలిగించేలా చేస్తోంది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంపికయ్యాక రెండు ఉప ఎన్నికలు వచ్చాయి. ఒకటి హుజూరాబాద్ రెండు మునుగోడు. ఈ రెండింట్లోనూ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు దక్కించు కోలేక పోయాయి(Congress Loss).
ఇది ఆయన పనితీరుకు అద్దం పడుతుంది. మరో వైపు ఊహించని రీతిలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును భారతీయ జనతా పార్టీ తీసుకోవడం ఒకింత ఆలోచించాల్సిన అంశం. రాహుల్ జోడో యాత్ర పేరుతో సీనియర్లు దూరంగా ఉన్నా అసలు మునుగోడులో ఆశించిన మేర పని చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
రాబోయే ఎన్నికల్లో కనీసం సత్తా చాటాలంటే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేదంటే పార్టీ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
Also Read : ఒంటరి పోరాటానికి దక్కని డిపాజిట్