Virat Kohli : విరాట్ కోహ్లీకి ఏమైంది..ఎందుకిలా

రోజు రోజుకు ఆట తీరు అధ్వాన్నం

Virat Kohli  : ప్ర‌పంచ క్రికెట్ లో టాప్ ఐదుగురు ఆట‌గాళ్ల‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli )ఒక‌డు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేదు. కానీ గ‌త కొంత కాలంగా కోహ్లీ ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌లేక పోతున్నాడు.

ప్ర‌ధానంగా ఆట తీరులో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ స్కోర్లు చేయ‌డం అటుంచితే క్రీజులో నిల‌దొక్కుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నాడు.

ఒకప్పుడు కోహ్లీ క్రీజులోకి వ‌స్తున్నాడంటే ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు జ‌డుసుకునేవి. అత‌డిని పెవిలియ‌న్ కు పంపించాలంటే నానా ర‌కాలుగా ప్ర‌యోగాలు చేసే వారు.

ఒక్క‌సారి డిసైడ్ అయితే త‌న మాట తానే విన‌ను అన్న‌ట్టుగా ఉంటుంది కోహ్లీ(Virat Kohli )అటిట్యూడ్. కానీ ఎప్పుడైతే కెప్టెన్సీ కోల్పోయాడో త‌న‌ను తాను నియంత్రించు కోలేక పోతున్నాడు.

ఇదే విష‌యంపై తాజా, మాజీ ఆట‌గాళ్లు సైతం కోహ్లీ గురించి ఆందోళ‌న చెందుతున్నారు. ప్రపంచ క్రికెట్ లో ఆడే ప్ర‌తి ఒక్క ఆట‌గాడు లేదా గొప్ప‌గా భావించే, టాప్ లో ఉన్న క్రికెట‌ర్లంతా ఎప్పుడో ఒక‌ప్పుడు ఫామ్ కోల్పోయిన వారే.

కంటిన్యూగా ఆడ‌డం అన్న‌ది చాలా అరుదు. అది కొంద‌రికే సాధ్యం. గ‌వాస్క‌ర్, క‌పిల్ దేవ్ , మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ , గంగూలీ, ద్ర‌విడ్, ధోనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంద‌రో ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నారు.

తాజాగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో గోల్డెన్ డ‌క్ తో వెనుదిరిగాడు. కోహ్లీ అభిమానులు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు.

పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షోయ‌మ్ అఖ్త‌ర్ చెప్పిన‌ట్లు సూప‌ర్ హీరో గా కాకుండా ఆర్డిన‌రీ ప్లేయ‌ర్ గా ఆడేందుకు ప్ర‌య‌త్నం చేయి అని సూచించాడు.

Also Read : కార్తీక్ ఎంట్రీకి వ‌య‌సుతో ప‌నేంటి

Leave A Reply

Your Email Id will not be published!