Allu Arjun Zomato : ఏం కావాల‌న్నా జొమాటా ఉందిగా

మ‌న‌సు న‌చ్చితే ఎక్క‌డికైనా అంటున్న యాడ్

Allu Arjun Zomato : కాలం మారింది. టెక్నాల‌జీ ఛేంజ్ అయ్యింది. ఇప్పుడు సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ ప్ర‌చారం అన్న‌ది ప్ర‌ధానంగా మారింది. క్రియేటివిటీ క‌లిగిన వారికి గ‌తంలో అవ‌కాశాలు దొరికేవి కావు.

కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. ఒక ర‌కంగా గూగుల్ కు థ్యాంక్స్ చెప్ప‌క త‌ప్ప‌దు. యూట్యూబ్ కోట్లాది మంది క్రియేట‌ర్స్ కు స్వ‌ర్గ‌ధామంగా మారింది.

కంటెంట్ ఉన్నోడికి ఎలాంటి సిఫార‌సులు, పైర‌వీలు అక్క‌ర్లేదు. అలాంటి వేదిక‌ను ఏర్పాటు చేసింది ఈ సెర్చించ్ దిగ్గ‌జ సంస్థ‌. ఇక జ‌స్ట్ సెకండ్ల‌లో వ‌చ్చే యాడ్స్ చూపే ప్ర‌భావం అంతా ఇంతా కాదు.

ప్రపంచ వ్యాప్తంగా యాడ్స్ త‌యారయ్యేందుకు వేలాది మంది త‌మ మెద‌ళ్ల‌కు ప‌దును పెడ‌తారు. ఇక టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సినిమాల్లోనే కాదు యాడ్స్ ల‌లో కూడా న‌టిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు స్టార్స్.

ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు దేశాన్ని ఊపేస్తోంది. త‌న కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది పుష్ప‌రాజ్. ఏకంగా రూ. 365 కోట్లు కొల్ల‌గొట్టింది. మ‌నోడు ఈ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు.

ఇదే సంద‌ర్భంలో తాజాగా ప్రముఖ డోర్ డెలివ‌రీ కంపెనీ జొమాటో అల్లు అర్జున్Allu Arjun Zomato) తో యాడ్ రూపొందించింది. ఇందులో మ‌న‌సుకు న‌చ్చితే త‌గ్గేదే లేదంటున్నాడు బ‌న్నీ. అత‌డితో పాటు న‌టుడు సుబ్బ‌రాజు కూడా న‌టించాడు.

జ‌స్ట్ రిలీజ్ అయిన జొమాటో యాడ్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎంతైనా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క పెట్టుకోవాలి క‌దూ. మొత్తంగా ఐకాన్ స్టార్ ఆగ‌నంటుంటే త‌గ్గ‌నంటోంది జొమాటో.

Also Read : 7న ఎఫ్-3 మూవీ సాంగ్ రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!