Diwali 2024 : అసలు దీపావళి ఎప్పుడు..అక్టోబర్ 31 నా..నవంబర్ 1..?

సాధారణంగా దీపావళి పండుగను ఏటా అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు...

Diwali : చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఆనందోత్సాహాల నడుమ కష్టాల చీకట్లు తొలగించి సుఖాల వెలుగులు ప్రసాదించాలని కోరుతూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. ఆనంద దీపాలను మదిలో వెలిగించుకుని సుఖసంతోషాల జీవితానికి స్వాగతం పలుకుతూ దీపావళిని ఎంతో సరదాగా జరుపుకుంటారు. ఇంటిని దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలికి అష్ట ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగే దీపావళి. దీపాల వెలుగులతో నిండే దివాళి(Diwali)కి చిన్నాపెద్దా సిద్ధమవుతున్నారు. దీపావళి సంబరం అంబరాన్ని అంటేలా జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి అందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న ఒకటి ఉంది. అదే దీపావళి ఏ రోజు అనేది. కొందరేమో అక్టోబర్ 31న అంటుండగా.. మరికొందరు నవంబర్ 1నే దీపావళి(Diwali) పండగ అని చెబుతున్నారు. మరి ఇందులో నిజమేంటి.

Diwali 2024 Updates

అక్టోబర్ 31వ తేదీ గురువారం ఉదయాత్ పూర్వం చతుర్దశి తిథి ఉన్నందున నరక చతుర్దశిగా, దీపావళి పండుగను జరుపుకోవచ్చు. మళ్ళీ ఇదే రోజు గురువారం సాయంకాలానికీ అమావాస్య తిథి ఉన్నందున ధనలక్ష్మి పూజలు ఆచరించవచ్చు. అంటే 31వ తేదీనే రెండు తిథులు ఉన్నందునా రెండు పండుగలు దీపావళి, ధనలక్ష్మిపూజలు ఒకే రోజు జరుపుకోవచ్చని రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఉపాధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా అందోల్ డివిజన్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, చిదిరె శ్యామ్ నాథ్ శర్మ చెప్పారు. పండగకు సంబంధించి ఆయన తెలిపిన మరిన్ని వివరాలు..

సాధారణంగా దీపావళి పండుగను ఏటా అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం(తెలుగు రాష్టాల్లో) అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు అమావాస్య మొదలవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు ముగుస్తుంది. దాని తరువాత పాడ్యమి మొదలవుతుంది. దీంతో అక్టోబర్ 31నే పండగ జరుపుకోవాలని శ్యామ్ నాథ్ శర్మ చెప్పారు.

పూజా సమయాలు

లక్ష్మీ పూజ ముహూర్తం: అక్టోబర్ 31, 2024న సాయంత్రం 05:36 నుండి 06:16 వరకు

అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 31, 2024న మధ్యాహ్నం 03:52

అమావాస్య తిథి ముగింపు: నవంబర్ 01, 2024న సాయంత్రం 06:16 గంటలకు

ధృక్ పంచాంగం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో దీపావళి వేడుకలు నవంబర్ 1వ తేదీన జరుపుకుంటారు.

Also Read : Chhota Rajan : గ్యాంగ్ స్టార్ చోట రాజన్ బైలు మంజూరు చేసిన ముంబై హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!