Mumbai Indians 2022 : ఈనెల 26 నుంచి ముంబై వేదికగా మెగా రిచ్ లీగ్ ఐపీఎల్ (IPL) సంబురం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 14 సీజన్లు కొనసాగాయి. ఇది 15వ సీజన్. అత్యధిక టైటిళ్లు గెలిచిన చరిత్ర ముంబై ఇండియన్స్(Mumbai Indians 2022) కు ఉంది. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఈ టీమ్ 2013, 2015 జరిగిన పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి విజేతగా నిలిచింది. 2017లో పుణె సూపర్ జెయింట్ జట్టుపై గెలుపొంది కప్పు కైవసం చేసుకుంది.
ప్రస్తుతం జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్ గా ఉండగా దిగ్గజ మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనే కోచ్ గా ఉన్నాడు. 2008లో ఏర్పాటైన
ఈ టీం కు భారత దేశపు అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం కింద ఇండియా విన్ స్పోర్ట్స్ అనుబంధంగా ఉంది.
2017లో ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీలకు సంబంధించి బ్రాండ్ వాల్యూలో 100 మిలియన్లు దాటిన మొదటి ఫ్రాంచైజీ గా రికార్డు సృష్టించింది.
2019లో దాని విలువ ఏకంగా రూ. 9, 809 కోట్లు. 2011లో ఆర్సీబీని ఓడించి టైటిల్ పొందింది.
రాజస్థాన్ రాయల్స్ ను 33 రన్స్ తేడాతో ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. 2017లో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెన్సేషన్ విక్టరీ సాధించి టైటిల్ చేజిక్కించుకుంది.
2019లో సైతం సీఎస్కేను ఓడించింది. ఇక ముంబై ఇండియన్స్(Mumbai Indians 2022) ఈసారి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇక జట్టు పరంగా చూస్తే .
రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్ కాగా , బుమ్రా, పొలార్డ్ , సూర్య కుమార్ , ఇషాన్ కిషన్ , బ్రెవిస్, బాసిల్ థంపి, అశ్విన్ , జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే ఆడతారు.
వీరితో పాటు తిలక్ వర్మ, సంజయ్ యాదవ్ , జోఫ్రా ఆర్చర్ , డేనియల్ సామ్స్ , టైమల్ మిల్స్ , టిమ్ డేవిడ్, రిలే మెరిడెత్, అర్ఝద్ ఖాన్, ప్రీత్ సింగ్, రమణ దీప్ సింగ్ , రాహుల్ బుద్ది, షోకీన్, అర్జున్ టెండూల్కర్ , ఆర్యన్, అలెన్ ఉన్నారు.
గత సీజన్ లో విఫలమైన ముంబై ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని అనుకుంటోంది.
Also Read : జయహో భగత్ సింగ్ సైనిక్ స్కూల్