Akshata Murty : ఎవరీ అక్షతా మూర్తి ఏమిటా కథ
మోస్ట్ పాపులర్ బిలియనీర్..రిషి సునక్ భార్య
Akshata Murty : బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తదపురి ప్రధానమంత్రి ఎవరు అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కూడా తాను పోటీలో ఉన్నట్లు ప్రకటించాడు.
ఈ మొత్తం కథ వెనుక తెలుసు కోవాల్సింది ఇంకొకటి ఉంది. అదే అక్షతా మూర్తి ఎవరనేది. ఆమె ఎవరో కాదు ప్రపంచ ఐటీ రంగంలో టాప్ ఇండియన్ ఐటీ కంపెనీగా పేరొందిన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి, సుధా నారాయణమూర్తి ముద్దులు కూతురే ఈ అక్షతా మూర్తి (Akshata Murty).
ఇక రిషీ సునక్ ప్రధాన మంత్రి రేసులో ఉండడంతో అక్షతా మూర్తి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ అక్షతా మూర్తినే కాబోయే ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునక్ భార్య కావడం.
ఆమె ప్రపంచంలోని మహిళా ధనవంతురాలలో ఒకరుగా పేరొందారు. బ్రిటన్ లో మోస్ట్ పాపులర్ బిజినెస్ విమెన్. కాటమరెన్ వెంచర్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ లింక్డ్ ఇన్ లో పెట్టుబడి పెట్టారు.
పలు బ్రాండ్ లలో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇక రిషి సునక్ కూడా బిలియనీర్. ఇండియాలో పుట్టిన అక్షతా మూర్తి ఇప్పటికీ భారతీయ పౌరురాలిగానే ఉన్నారు. ఆమె నికర సంపద $1.2 బిలియన్లు. ఖతార్ పాలక రాజవంశానికి చెందిన అల్ థానీ కుటుంబం స్థాపించిన కంపెనీలో కూడా ఆమె సంస్థ భాగస్వామిగా ఉంది.
రూపెర్డ్ ముర్దోక్ పెద్ద కూతురు ప్రూడెన్స్ , అల్ తజీర్ కుటుంబం వాటాదారులతో కూడిన బ్రిటిష్ ఫర్నీచర్ మార్కెట్ ప్లేస్ అయిన ది
న్యూ క్రాఫ్ట్స్ మెన్ లో కూడా కాటమరాన్ వాటాను పొందింది.
అక్షతా మూర్తి వయస్సు 42 ఏళ్లు. ఇన్ఫోసిస్ లో ఆమెకు వాటా కూడా కలిగి ఉంది. 2001లో అక్షతా మూర్తిని(Akshata Murty) మొదటిసారిగా
షేర్ హోల్డర్ గా ప్రకటించింది కంపెనీ. ఆ తర్వాత 2,000 శాతం కంటే ఎక్కువగా షేర్లు పెరగడం గమనార్హం.
ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీగా ఉంది. ఇ స్పోర్ట్స్ , ఇన్సూరెన్స్ , ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఫ్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ లో $1 బిలియన్
కంటే ఎక్కువ విలువైన హోల్డింగ్ లను పర్యవేక్షిస్తోంది.
దీనికి నారాయణ మూర్తి చైర్మన్ గా ఉన్నారు. బ్రిటీష్ శాఖకు ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు అక్షతా మూర్తి. 2017లో న్యూ అండ్ లింగ్ వుడ్ కి డైరెక్టర్ గా ఉన్నారు. ఆ తర్వాత తప్పుకున్నారు.
అదే ఏడాది లండన్ కు చెందిన ఫిట్ నెస్ కంపెనీ డిగ్మేలో డైరెక్టర్ గా ఉన్నారు. 4.4 శాతం వాటా కలిగి ఉన్నారు. భారత దేశంలో కొత్త పేరుతో రెస్టారెంట్లను ప్రారంభించారు. ఇందులో కూడా భాగస్వామిగా ఉన్నారు.
Also Read : బ్రిటన్ పీఎం రేసులో రిషి సునక్