India Squad ODI 2023 : ఐసీసీ వరల్డ్ కప్ లో ఉండేది ఎవరో
15 మంది ఆటగాళ్ల ఎంపికపై ఉత్కంఠ
India Squad ODI 2023 : వచ్చే ఏడాది 2023 లో రెండు ప్రతిష్టాత్మకమైన క్రికెట్ టోర్నీలు కొనసాగనున్నాయి. పాకిస్తాన్ లో ఆసియా కప్ జరగనుండగా భారత దేశంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐపీఎల్) కు సంబంధించి వన్డే వరల్డ్ భారత్ చేపట్టనుంది(India Squad ODI 2023). ఇక పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు , బీసీసీఐ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఈ తరుణంలో పాకిస్తాన్ ఆడుతుందా లేదా అన్నది అనుమానంగా ఉంది. ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వన్డే వరల్డ్ కప్ లో జట్టులో వచ్చేందుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.
బీసీసీఐలో రాజకీయాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. వరల్డ్ కప్ లో టీమిండియా తరపున 15 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. వీరిలో 11 మంది మాత్రమే ఆడతారు. మిగతా నలుగురు స్టాండ్ బై గా ఉంటారు. ఇదిలా ఉండగా 2023 టోర్నీకి ముందు భారత జట్టు 18 వన్డేలు, 9 టి20 మ్యాచ్ లతో పాటు 8 టెస్టు మ్యాచ్ లను ఆడాల్సి ఉంది.
ఇక వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరుగుతుంది. బ్యాటర్లు, ఫీల్డర్లు, వికెట్ కీపర్లు, ఆల్ రౌండర్లను ఎంపిక చేయడం ఇబ్బందికరంగా మారంది బీసీసీఐకి. రోహిత్ శర్మ, ధావన్ ఓపెనింగ్ లో ఉండే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ 3వ ప్లేస్ లో , అయ్యర్ 4వ స్థానంలో రాహుల్ లేదా పంత్ 5వ స్థానంలో ఉంటారు.
వీరితో పాటు శుభ్ మన్ గిల్ , సంజూ శాంసన్ , సూర్య కుమార్ యాదవ్ , దీపక్ హూడా కూడా పోటీలో ఉన్నారు. ఇక 6,7 ప్లేస్ లలో పాండ్యా, జడేజా , సుందర్ , ఠాకూర్ , దీపక్ చాహర్ ను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. 8,9,10,11 ప్లేస్ లలో సుందర్ , శార్దూల్ , దీపక్ , కుల్దీప్ , భువీ, షమీ, సిరాజ్ , చాహల్ లో ఎవరు ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదిలా ఉండగా కేరళ స్టార్ సంజూ శాంసన్ పై బీసీసీఐ వివక్ష చూపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Also Read : ఐపీఎల్ మినీ వేలంపై ఉత్కంఠ