KK Attribute : గాయక దిగ్గజం మూగ బోయిన స్వరం
హఠాన్మరణం కళాకారుల కన్నీటి పర్యంతం
KK Attribute : దిగ్గజ గాయకుడిగా పేరొందిన కేకే హఠాన్మరణంతో యావత్ సినీ భారతావని శోకసంద్రంలో మునిగి పోయింది. బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, టాలీవుడ్ ఇలా ప్రతి ఒక్కరు కేకే ఇక లేరన్న వాస్తవాన్ని తట్టుకోవడం లేదు.
ప్రధానంగా కేకేకు బాలీవుడ్ తో ఎక్కువ అనుబంధం ఉంది. ఎన్నో సినిమాలకు తన గాత్ర మాధుర్యాన్ని పంచారు. అద్భుతమైన పాటలతో అలరించారు. ఆకట్టుకున్నారు. గుండెల్ని మీటారు.
కేకే మరణం భారత దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గాయనీ గాయకులు, నటీ నటులు దేశం నలుమూలల
నుంచి సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన గాయకులు సైతం స్పందించారు.
గొప్ప గాయకుడు లేడు అన్నది ఇప్పటికీ జీర్ణించు కోలేక పోతున్నామని పేర్కొన్నారు. గాయని శ్రేయా ఘోషల్ షాక్ కు గురైనట్లు తెలిపారు. నటుడు అక్షయ్ కుమార్ అయితే ఇది నిజం కాక పోయి ఉంటే బావుండేదన్నారు.
కేకే(KK Attribute) ఆకస్మిక మరణం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కేకే తన పాటలతో చిరస్థాయిగా నిలిచి పోతారని పేర్కొన్నారు మరో గాయని. రణ వీర్ సింగ్ , దీపికా పదుకొనే చిత్రం కోసం చివరిసారిగా పాడారు కేకే.
కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం బాధాకరం. ఆయన స్వరం అన్ని వయసుల వారిని తాకిందన్నారు అమిత్ చంద్ర షా. కేకే మరణ
వార్త వినడం తట్టుకోలేకున్నా. దేవుడా ఎందుకు ఇలా అని రాహుల్ వైద్య వాపోయాడు.
ఇది ఊహించని విషాద వార్త అని పేర్కొన్నారు నటుడు అక్షయ్ కుమార్. భారతీయ సంగీత పరిశ్రమకు తీరని నష్టం అని అన్నారు చిత్ర
నిర్మాత అశోక్ పండిట్.
కేకే(KK Attribute) కు నివాళులు అర్పించిన వారిలో ఆర్మాన్ మాలిక్ , విశాల్ దద్లానీ, సలీం మర్చంట్ , జుబిన్ నౌటియాల్ , మోహిత్ చౌహాన్ ,
ఫర్హాన్ అక్తర్ , దర్శన్ కుమార్ , స్వరా భాస్కర్ , అజయ్ దేవగన్, శ్రేయా ఘోషల్ , నీల్ నితిన్ ముఖేష్ ఉన్నారు.
Also Read : దిగ్గజ గాయకుడు కేకే ఇక లేరు