Princes Diana : లోకాన్ని వీడినా వెంటాడుతున్న డయానా
లోకం వీడి నేటికి 25 సంవత్సరాలు
Princes Diana : ఈ ప్రపంచంలో కొందరిని మరిచి పోలేం. ఎందుకంటే వాళ్లు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి పోతారు. మనల్ని వెంటాడుతారు. అలాంటి వారిలో పాకిస్తాన్ కు చెదిన బెనజీర్ భుట్టో మరొకరు ప్రిన్సెస్ డయానా(Princes Diana).
ఇవాళ ఆమె వర్దంతి. సరిగ్గా ఇదే రోజు ఆగస్టు 31న 1997లో కారు ప్రమాదంలో మరణించింది. దీనిని కొందరు ప్రమాదం కాదని హత్య అని కూడా ఆరోపించారు.
ఏది ఏమైనా ఆమె చెరగని చిరునవ్వు, రూపం ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. బ్రిటీష్ యువరాజులు విలియం, హ్యారీ బుధవారం వారి తల్లి ప్రిన్సెస్ డయానా 25వ వర్ధంతిని జరుపుకున్నారు.
డయానా స్పెన్సర్, ప్రిన్స్ చార్లెస్ తో జరిగిన వివాహం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత అవిశ్వాసం, విడాకుల వార్త గుప్పుమంది.
అదే సమయంలో ప్రిన్సెస్ డయానా కారు ప్రమాదానికి గురైంది. ప్రాణాలు కోల్పోయింది. ఐదేళ్ల కిందట ఆమె కుమారులు స్మారక చిహ్నం వద్దకు హాజరయ్యారు.
ఈసారి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనరని తెలిపింది. విలియం ఇటీవల తన భార్య కేథరీన్ , వారి ముగ్గురు చిన్న పిల్లలతో లండన్ నుండి విండర్స్ ఎస్టేట్ కు మారుతున్నట్లు ప్రకటించారు.
హ్యార్ కాలిఫోర్నియాలో తన భార్య మేఘన్ , వారి ఇద్దరి పిల్లలతో నివసిస్తున్నారు. ఈ జంట 2020 ప్రారంభంలో రాజ కుటుంబాన్ని విడిచి పెట్టారు.
ఇదిలా ఉండగా కేవలంల 36 ఏళ్ల వయస్సులో డయానా తన విలువైన జీవతం నుంచి నిష్క్రమించింది.
పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. డయానా ఓ ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింప బడుతోంది. హెచ్ఐవీ, ఎయిడ్స్ ఉన్న వ్యక్తుల పట్ల మార్పు తీసుకు వచ్చేందుకు డయానా(Princes Diana) కృషి చేసింది.
ఎన్నో స్వచ్చంధ సంస్థలతో కలిసి పని చేసింది. ప్రశంసలు అందుకుంది. గత వారంతంలో ఆమె స్వంతం చేసుకున్న స్పోర్టి ఫోర్డ్ ఎస్కార్ట్ వేలంలో 7,37,000 పౌండ్లకు విక్రయించబడింది.
చని పోయి ఇన్నేళ్లయినా డయానాకు క్రేజ్ తగ్గలేదు. నెట్ ఫ్లిక్స్ డ్రామా ది క్రౌన్ పేరుతో సీరీస్ విడుదల చేసింది. దీనికి విపరీతమైన జనాదరణ లభించింది.
మెజెస్టీ మేనిజింగ్ ఎడిటర్ జో లిటిల్ మాట్లాడుతూ డయానా తన కుమారులను అత్యంత ప్రభావితం చేసిందన్నారు. ఇదిలా ఉండగా రాజకుమారి
డయానా మరణించిన సమయంలో విలియంకు 15 ఏళ్లు, హ్యారీకి 12 ఏళ్లు.
గత ఏడాది సోదరులు ఇద్దరూ ఆమె 60వ పుట్టినరోజు పురస్కరించుకుని కెన్సింగ్టన్ ప్యాలెస్ లో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ప్రేమ..అభిమానం ఆమెను మరింత గుర్తు పెట్టుకునేలా చేసింది. డయానా సాధారణంగా బతికేందుకు ఇష్ట పడింది. కానీ పంజరంలో ఉండ లేక పోయింది.
Also Read : దృష్టి లోపం..రూ. 47 లక్షల ప్యాకేజీ సొంతం