BCCI Pant : ‘పంత్’ పై బీసీసీఐకి ఎందుకంత ప్రేమ
సంజూ శాంసన్ పై ఎడతెగని వివక్ష
BCCI Pant : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుసరిస్తున్న ఎంపిక విధానం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గత కొంత కాలం నుంచి ప్రత్యేకించి కేరళ స్టార్ సంజూ శాంసన్(Sanju Samson) పట్ల అనుసరిస్తున్న వివక్షపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఎవరైనా..ఏ దేశంలోనైనా ఆయా జట్లను ఎంపిక చేసే సమయంలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.
కానీ బీసీసీఐ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. గత కొంత కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు(BCCI Pant) ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. కంటిన్యూగా ఫెయిల్ అవుతూ వస్తున్నా అతడిని ఎంపిక చేస్తూ బాగా ఆడుతున్న సంజూ శాంసన్ పట్ల కక్ష కట్టడంపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు.
ట్విట్టర్ వేదికగా సంజూ ఫ్యాన్స్ ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. ఎంపిక చేయక పోవడానికి గల కారణాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఆడిన మ్యాచ్ లు, చేసిన పరుగులతో పాటు స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే కూడా ఇతర ఆటగాళ్ల కంటే టాప్ లో ఉన్నాడు సంజూ శాంసన్.
ఏ ప్రాతిపదికన రిషబ్ పంత్ ను ఎంపిక చేశారంటూ నిలదీస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ఆఖరి నాలుగు వన్డేలలో 13, 9, 8, 4 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ చివరి నాలుగు వన్డేలలో 86 , 30, 2 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. కీవీస్ తో జరిగిన తొలి వన్డేలో 38 బంతులు ఎదుర్కొని 36 రన్స్ చేశాడు.
దీపక్ హూడా, సూర్యను పక్కన పెట్టాలి. శాంసన్ 9 మ్యాచ్ లలో 294 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 73.5 చేశాడు. ఇక అత్యధిక సిక్సర్లు ఈ ఏడాదిలో సాధించిన వారిలో చూస్తే కూడా సంజూ శాంసన్ టాప్ లో ఉన్నాడు.
శాంసన్ 14 సిక్సర్లు కొడితే అయ్యర్ 10, శుబ్ మన్ గిల్ 9 సిక్సర్లతో ఉన్నారు. భారత్ తరపున 10 ఇన్నింగ్స్ ల తర్వాత అత్యధిక వన్డే సగటు చూస్తే శాంసన్ 66.0 స్ట్రైక్ రేట్ ఉంటే గిల్ 62.8 , కేదార్ జాదవ్ 54, శిఖర్ ధావన్ 48.0 గా ఉంది. పంత్ ఈ దరిదాపుల్లో లేడు.
Also Read : రాణించినా రెండో వన్డేలో సంజూపై వేటు