Aqib Javed : స్వదేశంలో జరిగిన రెండు టెస్టులు డ్రా కావడానికి కారణం పేలవమైన పిచ్ లు తయారు చేయడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పాకిస్తాన్ లో.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లన్నీ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. పలువురు మాజీ ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ , సిఇఓ రమీజ్ రజాపై విమర్శలు గుప్పించారు.
తాజాగా వారి సరసన పాకిస్తాన్ మాజీ పేసర్ అకీబ్ జావెద్ (Aqib Javed)కూడా చేరి పోయాడు. పిచ్ లు ఎలా తయారు చేయాలనే దానిపై పీసీబీ ముందుగా బీసీసీఐని సంప్రదిస్తే బావుంటుందని సూచించాడు.
జావెద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫస్ట్ , సెకండ్ టెస్టులో పరుగుల వరద పారింది. అనూహ్యంగా రెండో టెస్టులో ఓటమి నుంచి తప్పించుకుంది పాకిస్తాన్ టీమ్.
పిచ్ ల నిర్వహణ సరిగా లేదంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై మండి పడుతున్నారు ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు. అంతే కాకుండా ఐపీఎల్ ను పీఎస్ఎల్ తో రమీజ్ రజా పోల్చడంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
పాకిస్తాన్ కు చెందిన పిచ్ తయారు చేసే క్యూటర్లు ఇండియాలోని క్యూటర్లను సంప్రదించి సలహాలు తీసుకుంటే మంచిదని సెలవిచ్చారు అకీబ్ జావెద్. ముంబై, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాలకు చెందిన క్యూరేటర్లతో మాట్లాడితే బాగుంటుందన్నాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు స్వచ్ఛమైన టర్నింగ్ ట్రాక్ లను తయారు చేయలేక పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ స్పిన్నర్లకు సాయం చేయమంటూ ఓ ఛానల్ తో మాట్లాడుతూ చెప్పాడు.
Also Read : ఈసారి ఐపీఎల్ టైటిల్ మాదే – ధావన్