Wife: భర్తను కరెంట్ షాక్ తో చంపి పూడ్చిపెట్టిన భార్య
భర్తను కరెంట్ షాక్ తో చంపి పూడ్చిపెట్టిన భార్య
Wife : హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ(KPHB) కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను కరెంట్ షాక్ తో చంపేసింది ఓ మహిళ. అనంతరం తన చెల్లి సహాయంతో ఆ శవాన్ని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సొంతూరికి వెళ్లిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Wife Killed Her Husband
మెదక్(Medak) జిల్లా పాతలింగాయపల్లెకు చెందిన సాయిలు, కవిత దంపతులు. వివాహమై దాదాపు 20 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు. అయితే భర్త సాయిలు 15 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేపీహెచ్ బీ కాలనీలోని మిత్ర హిల్స్ లో ఓ అపార్ట్ మెంట్ కు వాచ్ మెన్ గా పనిచేస్తూ సమీపంలో ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు. కవిత సోదరి జ్యోతి, మరిది మల్లేశం కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాి. తాగుబోతు అయిన సాయిలు తరుచూ భార్యను కొడుతూ చిత్ర హింసలకు గురుచేస్తూ ఉండేవాడు. దీనితో విరక్తి చెందిన భార్య(Wife) కవిత.. భర్తను ఎలాగైన హత్య చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం చెల్లెలు, ఆమె భర్త సాయాన్ని తీసుకుంది.
వారి పథకం ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో సాయిలు ఇంట్లోనే కవిత, జ్యోతి, మల్లేశం మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సాయిలు కల్లుతాగి నిద్రించాడు. ఇదే అదునుగా భావించిన కవిత… కరెంటు షాక్ తో సాయిలును విలవిల్లాడేలా చేసింది. కొన ఊపిరితో ఉండగా జ్యోతి, కవిత కలిసి అతడికి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేశారు. అనంతరం కవిత, మల్లేశం రూ.3వేలకు ఆటో మాట్లాడి జోగిపేట వైపు మృతదేహాన్ని తీసుకెళ్లారు. వీరి కదిలికలపై అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ గట్టిగా మాట్లాడటంతో తమ ఊరు సమీపంలో ఉందని నమ్మబలికారు.
అయినా, అతడు వినకపోవడంతో… మృతదేహన్ని శనివారం ఉదయం 11 గంటల సమయంలో తిరిగి మిత్ర హిల్స్‌కి తెచ్చారు. గుడిసెలోనే సాయంత్రం వరకు ఉంచారు. దుర్వాసన వస్తుండటంతో మృతదేహన్ని పడేయడానికి మలేశం చుట్టుపక్కల రెక్కీ నిర్వహించాడు. మిత్రహిల్స్ సమీపంలోనే నిర్మానుష్య ప్రాంతంలో నిర్మాణ వ్యర్ధాల కింద పూడ్చి పెట్టారు. అనంతరం మల్లేశం, జ్యోతి వారు ఇంటికి వెళ్లగా కవిత లింగాయపల్లెకు వెళ్లిపోయింది. అప్పటికే సాయిలు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు కవితపై అనుమానం వచ్చింది. మరోవైపు ఆటో డ్రైవర్ ఆదివారం మధ్యాహ్నం కేపీహెబీ పోలీసులకు జరిగిన విషయమంతా చెప్పాడు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఆదివారం రాత్రి కవితను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం మిత్రహిల్స్‌లోని గుడిసెను పరిశీలించగా విద్యుత్తు తీగలు తగలబెట్టినట్లు గుర్తించారు. మృతదేహన్ని పడేసిన చోటుకు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మార్వో సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
Also Read : Encounter: ఝార్ఖంఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ! మావోయిస్టు ప్రయాగ్ మాంఝీ హతం !