David Miller : డేవిడ్ మిల్లర్ కిల్లర్ అవుతాడా
అతడిని కంట్రోల్ చేయడం కష్టం
David Miller : అందరి కళ్లు గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న డేవిడ్ మిల్లర్ పైనే ఉన్నాయి. మోస్ట్ డేంజరస్ ప్లేయర్ గా పేరొందాడు. ఈ స్టార్ హిట్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
సౌతాఫ్రికాకు చెందిన ఈ క్రికెటర్ దంచి కొట్టడంలో సిద్దహస్తుడు. ప్రత్యర్థులు ఎవరు ఉన్నారని చూడడు. దాడి చేయడమే పనిగా పెట్టుకుంటాడు.
విచిత్రం ఏమిటంటే ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో చివరి దాకా వేలం పాటలో మిల్లర్ వైపు చూడలేదు. చివరి క్షణంలో గుజరాత్ అతడిని తీసుకుంది.
తనపై ఉంచిన నమ్మకాన్ని డేవిడ్ మిల్లర్(David Miller) నిలబెట్టుకున్నాడు. దుమ్ము రేపుతున్నాడు. మ్యాచ్ ఫినిషర్ గా దుమ్ము రేపుతున్నాడు. క్వాలిఫయిర్ -1లో రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చుక్కలు చూపించాడు డేవిడ్ కిల్లర్.
మిల్లర్ ను కట్టడి చేయగలిగితే రాజస్తాన్ కు ఫైనల్ లో ఈజీ అవుతుంది. అతడిని ముద్దుగా కిల్లర్ మిల్లర్ అని పిలుచుకుంటారు. 10 జూన్ 1989లో దక్షిణాఫ్రికా లోని నాటల్ ప్రావిన్స్ లో పుట్టాడు.
32 ఏళ్ల వయస్సు ఉన్నా ఫోర్లు, సిక్సర్లు కొట్టడంలో తనకు తానే సాటి. అందుకే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కు అతడు మెయిన్ పిల్లర్ గా మారాడు. 2010 నుంచి క్రికెట్ లో ఆడుతూ వచ్చాడు.
22 మే 2010లో విండీస్ తో వన్డే మ్యాచ్ ఆడాడు. ఇదే ఏడాది టీ20 ఇదే జట్టుతో ప్రారంభించాడు డేవిడ్ మిల్లర్(David Miller). 2012 నుంచి 2019 దాకా పంజాబ్ కింగ్స్ కు ఆడాడు ఐపీఎల్ లో.
2020-21 దాకా రాజస్తాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఈసారి గుజరాత్ కు మారాడు. ఎందుకనో రాజస్తాన్ వదిలేసుకుంది.
Also Read : టైటిల్ కు అడుగు దూరంలో శాంసన్