Shakira Gerard Split : పాప్ స్టార్ షకీరా బంధం తెగి పోనుందా
గెరార్డ్ పిక్ తో 12 ఏళ్ల బంధం ఇక కలేనా
Shakira Gerard Split : ప్రపంచ సినీ సంగీతంలో ఆమె ఓ కెరటం. ఉవ్వెత్తున ఎగసి పడే స్వరం పాప్ స్టార్ షకీరాది. మోస్ట్ పాపులర్ సింగర్ గా ఇప్పటికీ ఆదరిస్తారు సినీ సంగీత అభిమానులు.
షకీరా బార్సిలోనా ఫుట్ బాల్ క్రీడాకారుడు గెరార్డ్ పిక్ 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. సహజీవనం సాగించారు. వీరిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు.
2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా షకీరా..గెరార్డ్ పిక్(Shakira Gerard Split) కలుసుకున్నారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ కుదిరింది. వీరి ప్రేమకథకు మనమంతా ముగ్ధులమయ్యాం.
కాగా వీరిద్దరూ త్వరలో విడి పోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. స్పానిష్ పుటబాలర్ తనను మోసం చేసినట్లు షకీరా గుర్తించినట్లు బార్సిలోనాకు చెందిన వార్తా సంస్థ ఎల్ పీరియాడికో నివేదించింది.
ఇదిలా ఉండగా పాప్ స్టార్ షకీరా తన ఫియాన్సీ గెరార్డ్ పిక్ వేరే మహిళతో ఉండగా చూసింది. ఆ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేక పోయింది. తను మోస పోయానని కన్నీటి పర్యంతమైంది.
గత కొంత కాలం నుంచి షకీరా, గెరార్డ్ పిక ఒకే ఇంట్లో ఉండక పోవడం ఈ పుకార్లకు మరింత బలం చేకూరుస్తోంది. గెరార్డ్ పిక్ బార్సిలోనా లోని కాలే ముంటానర్ లోని తన బ్యాచిలర్ ప్యాడ్ లో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు.
అంతే కాకుండా గెరార్డ్ పిక్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం మానేసింది. ఇది మరింత అనుమానం కలుగ చేసింది.
షకీరా..గెరార్డ్ పిక్ లకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సాషా , మిలన్. ఒక ముద్దుతో అన్నింటిని నయం చేయగలరని పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఇక షకీరా పాడిన వాకా వాకా సాంగ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది.
Also Read : ‘లోకేష కమల్’ నెట్టింట్లో హల్ చల్