Punjab Kings 2022 : ఐపీఎల్ (IPL) లో మోస్ట్ పవర్ ఫుల్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎందుకనో లక్ కలిసి రానట్టుంది పంజాబ్ కింగ్స్(Punjab Kings 2022) కు. ఆ జట్టుకు నాలుగేళ్ల పాటు నాయకత్వం వహించిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (KL Rahul) గుడ్ బై చెప్పాడు.
ఇక కొత్త జట్టు అతడిని తీసుకుంది. దీని సంగతి పక్కన పెడితే ఈసారి ముంబై వేదికగా ప్రారంభమయ్యే
ఐపీఎల్ (IPL) 2022 రిచ్ లీగ్ లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతోంది.
ఆ జట్టు యాజమాన్యం మయాంక్ అగర్వాల్ కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఐపీఎల్ (IPL) లో పంజాబ్ కింగ్స్ పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ జట్టుకు మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతీ జింటా (Preity Zinta) , కరణ్ పాల్ ఓనర్లుగా ఉన్నారు.
సిఇఓగా సతీష్ మీనన్ , టీమ్ మేనేజర్ గా వైద్య, క్రికెట్ ఆపరేషన్స్ అండ్ హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే వ్యవహరిస్తున్నారు.
అసిస్టెంట్ కోచ్ గా జాంటీ రోడ్స్ , బ్యాటింగ్ సలహాదారుడిగా జూలియన్ వుడ్ , బౌలింగ్ కోచ్ గా డామియన్ రైట్ ,
అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ గా ప్రభాకర్ , క్రికెట్ సలహాదారుగా శంకర్ రాజ గోపాల్ ఉన్నారు.
జట్టు విశ్లేషకుడిగా ఆశిష్ పని చేస్తున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు (Punjab Kings 2022)పరంగా చూస్తే అద్భుతమైన ఆటగాళ్లు ఈ ఫ్రాంచైజీ స్వంతం చేసుకుంది. కానీ ఆశించిన రీతిలో సత్తా చాటలేక పోతోంది.
ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి శిఖర్ ధావన్ ను ఓన్ చేసుకుంది. దీంతో జట్టు మరింత బలంగా కనిపిస్తోంది.
ఇక జట్టు పరంగా చూస్తే బ్యాటర్లు శిఖర్ ధావన్ , భానుక రాజపక్సే, మయాంక్ అగర్వాల్ – కెప్టెన్ గా ఉన్నారు.
వికెట్ కీపర్లుగా జానీ బెయిర్ స్టో, సిమ్రాన్ సింగ్ , జితేష్ శర్మ , ఆల్ రౌండర్లలో లియామ్ లివింగ్ స్టోన్ , ఓడియన్ స్మిత్ ,
బెన్నీ హూవెల్ , షారుఖ్ ఖాన్ , రిషి ధావన్ , అన్ష్ పటేల్ , హర్ ప్రీత్ బ్రార్ , రాజ్ బావా , రిటిక్ ఛటర్జీ , ప్రేరక్ మన్కడ్ , అథర్వ తైడే ఆడనున్నారు.
ఇక బౌలర్ల పరంగా చూస్తే కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్ , రాహుల్ చహర్ , ఆర్దీప్ సింగ్ , ఇషాన్ పోరెల్ , సందీప్ శర్మ, వైభవ్ అరోరా, బల్దేజ్ సింగ్ ఆడనున్నారు. మొత్తంగా ఈసారైనా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read : చెన్నై సూపర్ కింగ్స్ అదుర్స్