RCB WPL 2023 : ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళుతుందా

ఇప్ప‌టికే టాప్ లో ఉన్న ముంబై

RCB WPL Playoffs : స్మృతీ మంధాన సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఊహించ‌ని రీతిలో రెండు మ్యాచ్ ల‌లో గెలుపొంద‌డంతో ప్లే ఆఫ్స్ కు వెళుతుందా అన్న దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్సీబీ లీగ్ లో భాగంగా 7 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా ఓట‌మి పాలైంది. ఆ త‌ర్వాత పుంజుకుని 2 మ్యాచ్ ల‌లో గెలుపొందింది.

దీంతో పాటు స్ట్రైక్ రేట్ ఎక్కువ‌గా ఉండ‌డంతో నువ్వా నేనా అన్న రీతిలో రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు (RCB WPL Playoffs) తో పాటు గుజ‌రాత్ జెయింట్స్ పోటీ ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే వ‌రుస గెలుపుల‌తో ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ బెర్త్ క‌న్ ఫ‌ర్మ్ చేసుకుంది హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియాన్స్. మ‌హిళా ప్రిమీయ‌ర్ లీగ్ పాయింట్ల ప‌ట్టిక‌లో 4వ స్థానంలో నిలిచింది.

టోర్నీలో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్ర‌మే ఆడాల్సి ఉంది. డ‌బ్ల్యూపీఎల్ లో ప్ర‌స్తుతం ఐదు జ‌ట్లు పాల్గొన్నాయి. భారీ ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది బీసీసీఐ. ప్ర‌పంచ క్రికెట్ లో తొలి మ‌హిళా ఐపీఎల్ ను 2023లో ప్రారంభించింది. ఇక లీగ్ వ‌ర‌కు వ‌స్తే ముంబై ఇండియ‌న్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ , యూపీ వారియ‌ర్స్ , రాయ‌ల్ చాలెంజ‌ర్స్ , గుజ‌రాత్ జెయింట్స్ ఉన్నాయి.

చివ‌ర‌కు నాలుగు మ్యాచ్ లు పోటీ ప‌డ‌తాయి. ఒక వేళ ఆర్సీబీ గ‌నుక లాస్ట్ మ్యాచ్ లో గెలుపొందితే టోర్నీలో యూపీ వారియ‌ర్స్ ను ఢీకొంటుందా అన్న‌ది తేలుతుంది. మొత్తంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సందేశం ప్లేయ‌ర్ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపిన‌ట్లుంది. ఆ త‌ర్వాత జ‌ట్టు పుంజుకుంది.

Also Read : సంజూ శాంస‌న్ చేసిన త‌ప్పేంటి

Leave A Reply

Your Email Id will not be published!