Sanju Samson : సంజూ శాంసన్‌కు ఛాన్స్ దక్కుతుందా
మూడో టి20 మ్యాచ్ కు భార త్ రెడీ
Sanju Samson : న్యూజిలాండ్ తో కీలకమైన మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొదటి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో టి20 మ్యాచ్ లో ఆతిథ్య కీవీస్ జట్టు భారత్ చేతిలో 65 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది.
మూడు మ్యాచ్ ల సీరీస్ ను భారత్ గెలుపొంది కైవసం చేసుకుంటుందా లేక కీవీస్ గెలిచి సీరీస్ సమం చేస్తుందా అన్నది వేచి చూడాలి. ఇక హార్దిక్ పాండ్యా, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మన్ లు సంజూ శాంసన్(Sanju Samson) పై కక్ష కట్టినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆసియా కప్, వరల్డ్ కప్ కు దూరం చేసింది.
ఇక యువ జట్టులో ఎంపిక చేసినా ఛాన్స్ ఇవ్వలేదు. పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తూ వస్తున్న రిషబ్ పంత్ ను ఎందుకు పక్కకు పెట్టడం లేదని నెటిజన్లు మండి పడుతున్నారు. నేపియర్ లో జరిగే ఈ మ్యాచ్ కు న్యూజిలాండ్ కు టిమ్ సౌథీ నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మోచేతి నొప్పి కారణంగా దూరమయ్యాడు.
అతడి స్థానంలో మార్క్ చాప్ మన్ ను జట్టు లోకి తీసుకున్నారు. ఇక టీమిండియాలో రెండో టి20 మ్యాచ్ లో కొనసాగించిన జట్టునే కొనసాగించే ఛాన్స్ ఉంది.
ఇషాన్ కిషన్ , రిషబ్ పంత్ , సూర్య కుమార్ యాదవ్ , శ్రేయాస్ అయ్యర్ , హార్దిక్ పాండ్యా, దీపక్ హూడా, వాసింగ్టన్ సుందర్ , భువనేశ్వర్ కుమార్ , అర్ష్ దీప్ సింగ్ , మహ్మద్ సిరాజ , యుజ్వేంద్ర చాహల్ ఉండే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా సంజూ శాంసన్ పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉంది.
Also Read : బోర్డు నిర్వాకం వార్నర్ ఆగ్రహం